Off The Record: వైసీపీలో అసమ్మతి గళాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో లుకలుకలు ఓ రేంజ్‌లో రచ్చకెక్కుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి… ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, ఈ వ్యవహారాన్ని హైకమాండ్ సీరియస్‌గా తీసుకోవడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. వెంకటగిరి నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌గా ఆనంను తప్పించి… నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డిని నియమించింది. ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజవర్గం వంతు వచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి…