Off The Record: బీజేపీలో ఉక్కపోత..? కన్నా వల్ల ఎవరి సీటుకు ఎసరు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కదలికలు రాజకీయవర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంటే.. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జనసేన, టీడీపీ శిబిరాల్లో గుబులు రేపుతున్నాయి. ఇటీవల కాలంలో ఆయన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మీద ఒంటికాలిపై లేస్తున్నారు. బీజేపీ నుంచి బయటకెళ్లేందుకే ఆయన ఆ విధమైన కామెంట్స్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. బీజేపీ తనపై వేటు వేస్తే భవిష్యత్ రాజకీయాల దిశగా కన్నా అడుగులు వేస్తారని అనుకుంటున్నారు. ఇదే సమయంలో జనసేనకు.. జనసేనానికి అనుకూలంగా ఆయన చేస్తున్న ప్రకటనలు రకరకాల ఊహాగానాలకు ఊతం ఇస్తున్నాయి. ఆ మధ్య జనసేన నెంబర్ టు నాదెండ్ల మనోహర్ స్వయంగా కన్నా ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ కావడం పెద్ద చర్చకు దారితీసింది. అప్పటి నుంచి కన్నా లక్ష్మీనారాయణ జనసేనలోకి వెళ్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆయన జనసేనలోకి వెళ్తే… వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ మధ్య పొత్తు కుదిరితే కన్నా ఎవరి సీటుకు ఎసరు పెడతారనే చర్చ సాగుతోంది.
Read Also: Off The Record: బీఆర్‌ఎస్ తొలి బహిరంగ సభకు ఖమ్మంనే ఎందుకు ఎంచుకున్నారు?
Also Read
కన్నా లక్ష్మీనారాయణ ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. నాలుగుసార్లు పెదకూరపాడు నుంచి వరుసగా ఎన్నికవుతూ వచ్చారు. 2009లో ఆయన గుంటూరు వెస్ట్‌కు మారి.. ఆ ఎన్నికల్లో గెలిచారు. 2014లో అదే గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసినా ఓడిపోయారు. 2014 ఎన్నికల వరకు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన తర్వాత బీజేపీలోకి వెళ్లారు. అనూహ్యంగా బీజేపీ ఏపీ అధ్యక్ష పదవి చేపట్టి.. 2019 ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు కన్నా. ప్రస్తుతం బీజేపీలో తనకు ప్రాధాన్యం లేదని భావిస్తున్నారో.. లేక బీజేపీ వల్ల ఏపీలో లాభం లేదని అనుకుంటున్నారో కానీ.. కాషాయ శిబిరాన్ని వీడేందుకు నిర్ణయించుకున్నారనే టాక్ నడుస్తోంది. సోము వీర్రాజుపై కన్నా నేరుగా చేస్తున్న ఆరోపణలు ఆ ప్రచారాన్ని బలపడేలా చేస్తున్నాయి.
కన్నా వచ్చేస్తున్నారని జనసైనికులు కూడా భావిస్తున్నారు. ఆయన పార్టీ మారితే జిల్లాలో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తనను వరుసగా నాలుగుసార్లు గెలిపించిన పెదకూరుపాడు నుంచి పోటీ చేస్తారా? లేక గుంటూరు వెస్ట్‌నే మరోసారి నమ్ముకుంటారా అనేది ప్రశ్న. ప్రస్తుతం ఆయన గుంటూరు వెస్ట్ పరిధిలోనే నివాసం ఉంటున్నారు. ఈ రెండు నియోజకవర్గాలు కాకుండా సత్తెనపల్లిలో కూడా కన్నా పేరు వినిపిస్తోందట. ఈ ప్రచారం ఎలా ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ పొత్తు కుదిరితే తమ సీట్లు ఎగిరిపోతాయని కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు కన్నా ఎపిసోడ్‌తో పెదకూరపాడు, గుంటూరు వెస్ట్, సత్తెనపల్లి టీడీపీ నేతలు ఇంకా ఎక్కువ ఆందోళన చెందుతున్నారట. ఈ మూడు చోట్లా టీడీపీ నేతలు కర్చీఫ్ వేసుకుని ఉన్నారు.
కాంగ్రెస్‌లో సుధీర్ఘకాలం కొనసాగిన కన్నా.. టీడీపీని గట్టిగా విభేదించేవారు. పదునైన విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో జనసేన-టీడీపీ పొత్తు కుదిరినా.. తెలుగు తమ్ముళ్లు పాత విషయాలను మనసులో పెట్టుకుని కన్నాపై కక్ష తీర్చుకుంటారా అనే అనుమానాలు ఉన్నాయట. అలాగే కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుతో కన్నాకు పడేది కాదు. రాయపాటి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. దీంతో కమ్మ సామాజికవర్గం కన్నాకు ఎంత వరకు సహకరిస్తుంది అనేది డౌట్. అయితే వచ్చే ఎన్నికలను టీడీపీ, జనసేన కీలకంగా భావిస్తున్నాయి. అందుకే పొత్తులో పోటీ చేస్తే పాత అంశాలను పెద్దగా పట్టించుకోబోరనే వాదన కూడా ఉంది. ఏది ఏమైనా.. కన్నా యాక్టివేట్ కావడం.. పార్టీ మారితే.. ఎవరి సీటుకు ఎర్త్ పెడతారనే చర్చ జోరుగా సాగుతోంది.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..