Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Jc Brothers Target The Police

Off The Record: జేసీ బ్రదర్స్ పోలీసులను టార్గెట్ చేశారా?

Published Date :October 23, 2025 , 10:45 pm
By Sudhakar Ravula
  • పోలీసుల విషయంలో జేసీ బ్రదర్స్‌ వివాదాస్పద వైఖరి..
  • నాడు దివాకర్‌రెడ్డి, నేడు ప్రభాకర్‌రెడ్డి అదే తీరు..
  • పోలీసుల్లో మగాళ్ళే లేరా అంటూ 2018లో దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలు..
  • నాలుక కోస్తానని అప్పుడు పోలీస్‌గా ఉన్న గోరంట్ల మాధవ్‌ వార్నింగ్‌..
  • నాడు మీసం మెలేసి పోలీస్‌ కౌంటర్‌ ఇచ్చిన మాధవ్‌..
  • తాజాగా తాడిపత్రి ఏఎస్పీపై నోరు పారేసుకున్న ప్రభాకర్‌రెడ్డి..
  • నాకూ గన్‌ ఉంది, మీ ఇంట్లో దూరతానంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు..
  • రోహిత్‌ కుమార్‌ చౌదరి పోలీస్‌ ఉద్యోగానికి అనర్హుడన్న జేసీ..
  • గొడవలు జరిగితే ఏఎస్పీ పారిపోతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు..
  • ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై పోలీస్‌ సంఘాల మండిపాటు..
  • తీవ్ర వివాదాస్పదం అవుతున్న జేసీ బ్రదర్స్‌ నోటి తీరు..
Off The Record: జేసీ బ్రదర్స్ పోలీసులను టార్గెట్ చేశారా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: దూకుడు, తెగింపు లేకుంటే రాజకీయాల్లో రాణించడం కష్టమని అంటారు. ఆ విషయంలో జేసీ బ్రదర్స్‌ ఒక ఆకు ఎక్కువే చదివారని అంటారు పొలిటికల్‌ పండిట్స్‌. పొజిషన్‌లో ఉన్నా, అపోజిషన్‌లో ఉన్నా… చట్టం మా చుట్టం అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం ఉంటుందన్నది రాజకీయ వర్గాల విస్తృతాభిప్రాయం. మరీ… ముఖ్యంగా పోలీసుల విషయంలో జేసీ బ్రదర్స్‌ వైఖరి ఎప్పుడూ వివాదాస్పదమే. గతంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసి కేసులు కూడా ఎదుర్కొన్నారు… మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఇప్పుడు అదే బాటలో ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి కూడా వెళ్తున్నట్టు కనిపిస్తోంది. 2018లో తాడిపత్రి ప్రాంతంలో ప్రభోదానంద స్వామి ఆశ్రమంపై దాడి జరిగినప్పుడు జేసీ దివాకర్‌రెడ్డి తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఆ సమయంలో పోలీసులు సరిగా వ్యవహరించలేదని, పోలీసుల్లో మగాళ్లే లేరా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు దివాకర్‌. ఆ ఘటన తర్వాత పోలీసు అధికారుల సంఘం తరఫున స్పందించిన అప్పటి జిల్లా కార్యదర్శి గోరంట్ల మాధవ్‌ ఇకపై ఎవరైనా పోలీసులను కించపరిచేలా మాట్లాడితే నాలుక కోస్తామని అన్నారు.

అయితే… తనను వ్యక్తిగతంగా దూషించారని భావించిన సీనియర్‌ జేసీ… అప్పుడు తాడిపత్రి పోలీసుస్టేషన్‌లో మాధవ్‌పై ఫిర్యాదు చేశారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా పోలీసుల టార్గెట్‌గా తీవ్ర వ్యాఖ్యలే చేశారు దివాకర్‌రెడ్డి. పోలీసులు వైసీపీ నేతలకు వంగి వంగి దండాలు పెడుతున్నారన్న ఆయన.. తాము అధికారంలోకి వచ్చాక, చెప్పినట్లు వినే పోలీసులను తెచ్చుకుంటామని అన్నారు. మొదట్లో పోలీస్‌గా ఉన్నప్పుడు దివాకర్ రెడ్డి మీద మీసం మెలేసి కౌంటర్ ఇచ్చిన గోరంట్ల మాధవ్‌…. ఎంపీ అయ్యాక కూడా అగే ఊపు కొనసాగించారు. పోలీసులు అంటే… ఎవరి బూట్లో నాకేవారు కాదంటూ… పోలీస్ బూట్లను ముద్దాడి జేసీకి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఇప్పుడు తమ్ముడు ప్రభాకర్‌రెడ్డి కూడా అదే తరహాలో అన్న బాటలోనే వెళ్తున్నారన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. తాడిపత్రి ఏఎస్పీగా పనిచేస్తున్న రోహిత్ కుమార్ చౌదరిపై తాజాగా నోరు పారేసుకున్నారు ప్రభాకర్‌రెడ్డి. అందునా పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజున చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. నా దగ్గరా… గన్‌ ఉంది, దానికీ లైసెన్సు ఉంది.. మీ ఇంట్లోకి దూరతానంటూ తీవ్ర అభ్యంతరకరంగా మాట్లాడారాయన. అసలు నువ్వు పోలీసు ఉద్యోగానికి పనికిరావు, నీకు ఎవరు ఉద్యోగం ఇచ్చారంటూ ఏఎస్పీని ఉద్దేశించి ఇష్టానుసారం నోరు పారేసుకోవడంపై మండి పడుతున్నాయి పోలీస్‌ సంఘాలు. అతనికి చదువు మాత్రమే ఉంది.. బుద్ధి, జ్ఞానం, తెలివి లేవు, ఈ ఉద్యోగానికి రోహిత్ కుమార్ చౌదరి అనర్హుడు.. ఏఎస్పీ కార్యాలయం ముందు నేను నిరసన చేస్తే.. రోహిత్ బయటకు రాకుండా దాక్కున్నాడని వెటకారంగా మాట్లాడ్డంపై పోలీస్‌ వర్గాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

తాడిపత్రిలో ఎక్కడైనా ఘర్షణలు జరిగి రాళ్లు రువ్వుకుంటే ఈ ఏఎస్పీ భయపడి పారిపోతున్నారని విమర్శించారు ప్రభాకర్‌రెడ్డి. ఆ వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని పోలీస్ అధికారుల సంఘం అడహక్ కమిటీ డిమాండ్ చేసింది. ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసుల సేవలను కీర్తిస్తుంటే.. ఇంకోవైపు అదే పార్టీకి చెందిన వ్యక్తి ఇలా దూషించడమేంటని ప్రశ్నిస్తున్నాయి సంఘాలు. తాడిపత్రి ఈరోజు ప్రశాంతంగా ఉందంటే… ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి చర్యల వల్లనేనని చెబుతున్నారు పోలీస్‌ సంఘాల నేతలు. ఏఎస్పీ వల్ల ఏదైనా తప్పు జరిగితే.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు కానీ.. ఇలా బహిరంగంగా మాట్లాడటం ఏంటన్నది వాళ్ల క్వశ్చన్‌. మరోవైపు పోలీస్‌ అధికారుల సంఘం అంటే ఏంటి? దానికి రిజిస్ట్రేషన్ ఉందా.. ఉంటే చూపించాలంటూ తాడిపత్రి టీడీపీ కౌన్సిలర్స్‌ డిమాండ్ చేశారు. అంతేకాకుండా పోలీస్ అధికారుల సంఘంలో ఉన్నవారు అసలు డ్యూటీలు చేయరా వారు యూనిఫాం వేసుకోకుండా టైంపాస్ చేస్తూ తిరుగుతూ ఉంటారని వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జెసి ప్రభాకర్ రెడ్డి చేయడం పుండు మీద కారం చల్లినట్టయింది. ఈ వివాదంపై జిల్లా ఎస్పీ జగదీష్ కూడా స్పందించారు. జేసీ మీద చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆ సంగతి ఎలాఉన్నా… అప్పుడు అన్న, ఇప్పుడు తమ్ముడు… ఇలా జేసీ సోదరులు ఇద్దరూ తాము చట్టానికి అతీతులం అన్నట్టుగా పోలీస్‌ అధికారుల మీద నోరు పారేసుకోవడం తీవ్ర వివాదాస్పదం అవుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ananthapur Police
  • Andhra Pradesh
  • JC brothers
  • JC Diwakar Reddy
  • JC Prabhakar Reddy

తాజావార్తలు

  • April 2026 Changes: LPG, ATM నుంచి పాన్‌ వరకు.. ఏప్రిల్‌ 1 నుంచి 5 ప్రధాన మార్పులు.. జేబుకు చిల్లే..!

  • Vijay Mallya: “నాడు రూ. 450 కోట్లకు కొంటే నవ్వారు.. నేడు గర్వంగా ఉంది!”.. RCB అమ్మకంపై విజయ్ మాల్యా ఎమోషనల్!

  • Priyanka Chopra: నిక్‌లో నిజాయతీ ఉంది.. ఆరు నెలల్లోనే పెళ్లి.. రూమర్లు ఎందుకు వస్తున్నాయో!

  • Peddi: అనుకున్నదే అయిందా? వెనక్కి తగ్గిన పెద్ది, కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

  • Nirav Modi Extradition: నీరవ్ మోడీకి భారీ షాక్.. భారత్‌కు అప్పగింతకు గ్రీన్ సిగ్నల్

ట్రెండింగ్‌

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions