Off The Record: దూకుడు, తెగింపు లేకుంటే రాజకీయాల్లో రాణించడం కష్టమని అంటారు. ఆ విషయంలో జేసీ బ్రదర్స్ ఒక ఆకు ఎక్కువే చదివారని అంటారు పొలిటికల్ పండిట్స్. పొజిషన్‌లో ఉన్నా, అపోజిషన్‌లో ఉన్నా… చట్టం మా చుట్టం అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం ఉంటుందన్నది రాజకీయ వర్గాల విస్తృతాభిప్రాయం. మరీ… ముఖ్యంగా పోలీసుల విషయంలో జేసీ బ్రదర్స్ వైఖరి ఎప్పుడూ వివాదాస్పదమే. గతంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసి కేసులు కూడా ఎదుర్కొన్నారు… మాజీ ఎంపీ జేసీ…