Off The Record: ఏపీ పాలిటిక్స్‌లో రోజా అంటే ఫైర్. ఫైర్ అంటే రోజా. రాజకీయ ప్రత్యర్థులపై నగరి మాజీ ఎమ్మెల్యే కమ్ మాజీ మినిస్టర్ విమర్శలు, అధికారం ఉన్నప్పుడు ఆమె చేసిన హడావిడి ఆ రేంజ్‌లో ఉండేవి మరి. సబ్జెక్ట్ ఏదైనా, తనకు తెలిసినా తెలియకున్నా… ఎదుటి వారిని ఏకిపారేయడంలో రోజా రూటే సపరేటు. నగరి నుంచి వరుసగా రెండుసార్లు గెలిచి… గత ఎన్నికల్లో మాత్రం టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు రోజా. మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో భర్త, సోదరుల పెత్తనం పెరిగిపోయిందన్న విమర్శలు పట్టించుకోలేదామె. ఓటమికి ముఖ్య కారణాల్లో అది కూడా ఒకటన్నది స్థానికంగా ఉన్న విస్తృతాభిప్రాయం. అలాగే… సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేష్ అంటే… అప్పట్లో ఒంటికాలి మీద లేచేవారు రోజా. ఇక మంత్రిగా హంగు ఆర్భాటాల గురించైతే చెప్పే పనే లేదని, మంత్రిత్వ శాఖల్ని బాగా ఎంజాయ్ చేసిన వాళ్ళలో ఆమెదే టాప్ పొజిషన్ అని అప్పట్లో చెప్పుకునేవారట.
Read Also: Mohan Babu: హాస్పిటల్ కు మోహన్ బాబు దంపతులు.. క్షమాపణలు చెప్పాలంటూ మీడియా ప్రతినిధుల ధర్నా!!!
అలా… అన్నీ కలగలిసి గత ఎన్నికల్లో సూమారు 45 వేలఓట్ల తేడాతో ఓడిపోయారామె. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం మారాక… రోజాకు కష్టాలు మొదలయ్యాయి. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు భారీగా అక్రమాలు చేశారంటూ… ఫిర్యాదులు చేశారు కూటమి నేతలు. ఆడుదాం ఆంధ్ర, నగరి భూ అక్రమాలు, టిటిడి ఉద్యోగుల ఇళ్ళ స్థలాల్లో గోల్‌మాల్ లాంటి వ్యవహారాలపై లోతుల్లోకి వెళ్తోందట సీఐడీ. ఇక ఎన్నికల తర్వాత అప్పుడప్పుడు మాత్రమే నియోజకవర్గంలో తళుక్కుమన్న మాజీ మంత్రి…ఈ మధ్య కాలంలో మరీ నల్లపూసైపోయారట. అయితే చెన్నై, కాదంటే హైదరాబాదులో ఉంటున్నారు తప్ప… నగరిని పూర్తిగా మర్చిపోయారన్న టాక్ నడుస్తోంది. ఇలాగే ఉంటే… రాజకీయంగా ఇబ్బందులు తప్పవని గ్రహించే… ఆమె రూట్ మారుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఓటమి తర్వాత అడపా దడపా కూటమి ప్రభుత్వం మీద ఎక్స్‌లో మెసేజ్‌లు పెడుతున్నా… అందుకు అట్నుంచి కూడా అంతకు మించిన స్థాయిలో కౌంటర్స్ పడుతుండటంతో… ఇప్పుడు ఆ పని కూడా చేయడంలేదంటున్నారు. పార్టీ కోరితే తప్ప ఇప్పుడు తనకు తానుగా బయటికి వచ్చి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలని రోజా అనుకోవడం లేదన్నది రోజా సన్నిహితుల మాటగా తెలిసింది. రోజా పెట్టే పోస్టులు ఆమెవి కాదని, అవన్నీ వైసీపీ నాయకత్వానికేనంటూ ఇటీవల ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్న మాటల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకుముందులా దూకుడుగా వెళితే… ఇబ్బందులు తప్పవని తెలిసే ఆమె మౌనంగా ఉంటున్నారని వైసీపీలోనే మాట్లాడుకుంటున్నారట. ఓవైపు కేసుల భయం, మరోవైపు ఏం మాట్లాడినా ఇరుక్కుంటామన్న ఆందోళనతో ఇప్పుడు రోజా డైవర్షన్ కోసం చూస్తున్నట్టు సమాచారం. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రాజకీయ సెగ నుంచి తప్పించుకోవడానికి… తిరిగి టాలీవుడ్, కోలీవుడ్ వైపు చూస్తున్నారట రోజా. క్యారెక్టర్ రోల్స్ చేయడానికి నేను రెడీ… అంటూ తన టీమ్ ద్వారా తెలుగు, తమిళంలోని పలువురు దర్శకులకు, నిర్మాతలకు సంకేతాలు పంపినట్టు సమాచారం.
Read Also: Training For MLAs And MLCs: రెండు రోజులపాటు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు
వాస్తవానికి రాజకీయాల్లో బిజీ అయ్యాక సినిమాలకు దూరం అయ్యారుగాని, అంతకు ముందు అంతకు ముందు తెలుగు ఇండస్ట్రీలో బిజీగానే ఉండేవారు రోజా. సిల్వర్ స్క్రీన్‌కు దూరం అయినా… మంత్రి అవబోయే ముందు వరకు బుల్లి తెర మీద పలు షోలు చేశారామె. ఇక మినిస్టర్ హోదా వచ్చాక ఆ కార్యక్రమాలకు సైతం బైబై చెప్పేశారు. కానీ… ఇప్పుడు మారిన పరిస్థితుల్లో… నిర్ణయం కూడా మారిపోయిందట. అది వెండితెరా? బుల్లి తెరా అన్నది ముఖ్యం కాదు.. ఎనీ స్క్రీన్.. విత్ మేకప్ అయామ్ రెడీ అంటున్నారట రోజా. ఆ మధ్య ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా హాజరవడం, పుష్ప 2 సినిమాను సూపర్ డూపర్ అని పొగిడేయడం లాంటివన్నీ ఒక వ్యూహం ప్రకారం జరుగుతున్నవేనని మాట్లాడుకుంటున్నాయట ఇండస్ట్రీ వర్గాలు. అదే సమయంలో మరికొన్ని డౌట్స్ కూడా వస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. నటించడానికి నేను రెడీ…. అని రోజా చెప్పినంత మాత్రాన అవకాశాలు వాటంతటవే పరిగెత్తుకు వస్తాయా? పరిస్థితులు ఇంతకు ముందులా ఉన్నాయా? అన్న అంశాల చుట్టూ చర్చ జరుగుతోందట. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎంగా ఉన్నారు. ఆయన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఖాయమైంది. తాను అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరితో పాటు …చిరంజీవి మీద కూడా ఓ రేంజ్‌లో విమర్శలు చేసేవారు రోజా. ఓ దశలో చిరంజీవి కూడా బాగా హర్ట్‌అయి ఓపెనైపోయారు. దీంతో రోజా రీ ఎంట్రీకి ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎంతవరకు సహకారం లభిస్తుందన్నది బిగ్ క్వశ్చన్ అట. టీవీ షోలకంటే సినిమాలవైపే ఆమె మనసు లాగుతున్నట్టు ప్రచారం ఉంది. కానీ…అక్కడున్న అవరోధాల్ని అధిగమించడం అంత తేలిక కాదన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఓవరాల్‌గా రోజా పాలిటిక్స్‌కు టెంపరరీ ప్యాకప్ చెప్పేసి తిరిగి మేకప్ వేసుకుందామని అనుకుంటున్నా… వాస్తవం వేరుగా ఉందన్నది ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలంటున్నారు పరిశీలకులు.