ఓవైపు కేసుల భయం, మరోవైపు ఏం మాట్లాడినా ఇరుక్కుంటామన్న ఆందోళనతో ఇప్పుడు రోజా డైవర్షన్ కోసం చూస్తున్నట్టు సమాచారం. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రాజకీయ సెగ నుంచి తప్పించుకోవడానికి... తిరిగి టాలీవుడ్, కోలీవుడ్ వైపు చూస్తున్నారట రోజా. క్యారెక్టర్ రోల్స్ చేయడానికి నేను రెడీ... అంటూ తన టీమ్ ద్వారా తెలుగు, తమిళంలోని పలువురు దర్శకులకు, నిర్మాతలకు సంకేతాలు పంపినట్టు సమాచారం.