Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Demand For Minister Post For Nandamuri Balakrishna

Off The Record: బాలయ్య పేరుతో టీడీపీలో కొత్త కుంపటి అంటుకుంటుందా?

Published Date :October 14, 2025 , 9:38 pm
By Sudhakar Ravula
  • కొత్తగా తెర మీదికి బాలకృష్ణకు మంత్రి పదవి డిమాండ్‌..
  • ఫలానా పదవి కావాలని ఎప్పుడూ అడగని బాలకృష్ణ..
  • ఇవ్వలేదని అలిగిన సందర్భాలు కూడా లేవు..
  • ఇప్పుడు హఠాత్తుగా ఫ్యాన్స్‌ ఎందుకు డిమాండ్‌ చేస్తున్నారు?..
  • మైండ్‌లో ఏది అనిపిస్తే బ్లైండ్‌గా అనేసే తత్వం..
  • ఫ్యాన్స్‌తో రచ్చ చేయించేంత స్కెచ్‌లు ఉంటాయా?..
Off The Record: బాలయ్య పేరుతో టీడీపీలో కొత్త కుంపటి అంటుకుంటుందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే సమస్య…. నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే….. అన్న బాలకృష్ణ డైలాగ్‌ ఇప్పుడు టీడీపీకే అప్లయ్‌ అవుతోందన్న టాక్‌ నడుస్తోంది ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో. బాలయ్య అసెంబ్లీలో నోరు తెరిచినా… ఆయన అభిమానులు హిందూపురంలో ప్లకార్డ్‌లు ప్రదర్శించినా… అంతిమంగా ఇరుకున పడుతోంది మాత్రం పార్టీనే ఆయన సినిమా డైలాగ్‌ను అప్లయ్‌ చేసి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ ఊసు లేదు. ఆల్రెడీ ఉన్న సమస్యలతో సతమతం అవుతున్న తెలుగుదేశం అధిష్టానం ఇప్పటికిప్పుడు చేయాలని కూడా అనుకోవడం లేదు. కానీ… ఇప్పుడున్న గోల చాలదన్నట్టు… ఉన్నట్టుండి బాలకృష్ణకు మంత్రి పదవి డిమాండ్‌ తెర మీదికి వచ్చింది. దాని గురించే ఇప్పుడు హాట్‌ హాట్‌ డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. ఇటు సినిమాలు, అటు రాజకీయాల్ని ఫుల్ టైంగా చేస్తున్న బాలకృష్ణ ఎప్పుడూ తనకు ఫలానా పదవి కావాలని అడగలేదు. నాకు ఇవ్వలేదని అలిగిన సందర్భాలు అసలే లేవు. పైగా పార్టీకి ఎప్పుడు అవసరం వచ్చినా… అందరికంటే ముందే ఉంటారు. కానీ… ఇప్పుడు ఆ పరిస్థితులకు భిన్నంగా, హఠాత్తుగా బాలయ్యకు మంత్రిపదవి ఇవ్వాలన్న డిమాండ్‌ తెరమీదికి వచ్చింది. దీంతో బ్యాక్‌గ్రౌండ్‌ స్టోరీ ఏంటని ఆరా తీయడం మొదలైంది.

అది అభిమానుల నుంచి వచ్చిన ఇన్‌స్టంట్‌ రియాక్షనా లేక ఆయన మనసులో కూడా అదే ఉండి… ఫ్యాన్స్ రూపంలో బయటికి వచ్చిందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో వాతావరణం ఆయన సహజశైలికి భిన్నంగా కనిపిస్తుండటం కూడా అనుమానాలకు తావిస్తోందంటున్నారు. సాధారణంగా మైండ్‌లో ఏది అనిపిస్తే… బ్లైండ్‌గా అదే బయటికి అనేస్తుంటారాయన. ఆ మాటలు వివిదాస్పదమైనా డోంట్‌ కేర్‌ అన్నట్టుగా ఉంటుంటారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఫ్యాన్స్‌తో డిమాండ్స్‌ పెట్టించి తనకు కావాల్సింది సాధించుకుంటారా అన్న డౌట్స్‌ కూడా ఉన్నాయి పొలిటికల్‌ సర్కిల్స్‌లో. అదే సమయంలో పరిస్థితుల ప్రభావం ఉందేమో… అన్నది కొన్ని వర్గాల మాట. ప్రస్తుతం ఏపీ కేబినెట్‌లో ఒకే ఒక్క మంత్రి పదవి ఖాళీ ఉంది. దాన్ని ఎమ్మెల్సీ నాగబాబుకు ఇస్తారని ప్రచారం జరిగినా… ఇంతవరకు ఏం జరగలేదు. ఈ పరిస్థితుల్లో బాలకృష్ణకు మంత్రి పదవి కావాలని ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేయడం ఆసక్తి రేపుతోంది. ఇటీవల అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్… జగన్‌ హయాంలో సినిమా పరిశ్రమను అవమానించారంటూ మాట్లాడటం, దానికి సభలోనే ఉన్న బాలకృష్ణ రియాక్షన్‌… అన్నీ కలిపి మేటర్‌ ఎట్నుంచి ఎటెటో తిరిగి.. చివరికి నా వ్యాఖ్యల్ని రికార్డ్స్ నుంచి తీసేయమని కామినేని కోరే వరకు వెళ్లాయి. ఆ సమయంలో చిరంజీవిని అవమానించారంటూ మెగా అభిమానులు బాలయ్య మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని మీద బాలకృష్ణ ఎక్కడా స్పందించలేదుగానీ… సీఎం చంద్రబాబును కలిసేందుకు సినిమా పరిశ్రమ తరపున వెళ్ళే వాళ్ల లిస్ట్‌లో తన పేరును తొమ్మిదో నంబర్‌లో పెట్టారంటూ ఆ రోజు అసెంబ్లీలోనే బాలకృష్ణ అన్న మాటల చుట్టూ కొత్త అనుమానాలు వస్తున్నాయట.

అదే…. నేను కేబినెట్‌ పొజిషన్‌లో ఉంటే లిస్ట్‌లో నా పేరు అంత వెనక్కి వెళ్ళేదా? అన్న భావన కూడా ఆయనకు వచ్చి ఉంటుందేమోనన్నది కొందరి అముమానం. తాజాగా హిందూపురం నియోజకవర్గంలో మూడు రోజులు పర్యటించారు బాలకృష్ణ. ఈ క్రమంలోనే… అక్కడి అభిమానులు కొందరు బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ప్లకార్డ్‌లు ప్రదర్శించారు. అక్కడక్కడా ఫ్లెక్సీలు కూడా వేశారు. హిందూపురం మండలం బసవనపల్లిలో అయితే.. ఏకంగా బాలకృష్ణ కాన్వాయ్‌ని ఆపిమరీ నినాదాలు చేశారు. ఎన్బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ ఆలిండియా అధ్యక్షుడు నంబూరి సతీష్‌తో పాటు కార్యకర్తలు ఈ నినాదాలు చేశారు. దీంతో బాలకృష్ణ నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నియోజకవర్గం అభివృద్ధికి అవసరమైన నిధులు తెస్తున్నా…. అంతా దైవేచ్ఛ అని చెప్పి వెళ్ళిపోయారట. ఆ ఇన్సిడెంట్‌ చుట్టూనే ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా. అభిమాన సంఘాల నుంచి ఈ ప్రతిపాదన రావడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా…. అన్న ప్రశ్నకు సమాధానం వెదికే పనిలో ఉన్నారు పొలిటికల్‌ పరిశీలకులు. హిందూపురం నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించారాయన. ఈ పరిస్థితుల్లో ఎవరెవరికో పదవులు వస్తున్నప్పుడు మా లీడర్‌కి ఏం తక్కువన్న ఆలోచన అభిమానుల నుంచి వచ్చిందా? లేక ఇంకేవైనా బలమైన కారణాలున్నాయో తెలియదుగానీ…ఈ డిమాండ్ మాత్రం టీడీపీ అధిష్టానాన్ని కాస్త ఇరుకున పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cm chandrababu
  • minister post
  • Nandamuri Balakrishna
  • off the record

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions