తెలంగాణలో కొత్త రాజకీయ రగడ మొదలైంది. కాకుంటే... ఇది మత పరంగా సున్నితమైన అంశం కావడంతో... జాగ్రత్తగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఇదే సమయంలో బీజేపీ డబుల్ స్టాండర్డ్స్ అనుసరిస్తోందన్న చర్చ సైతం మొదలైంది. త్వరలో రంజాన్ మాసం మొదలవబోతోంది. ఈ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించాయి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు. ఆఫీస్ సాధారణ సమయం కంటే ఒక గంట ముందే... అంటే సాయంత్రం నాలుగు గంటలకే ముస్లిం ఉద్యోగులంతా విధులు ముగించుకుని వెళ్ళిపోవచ్చు.