Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record L Ramana Ready To Quit From Tdp

టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు ఎల్‌ రమణ సిద్ధం!

Published Date :June 16, 2021 , 9:46 pm
By Lakshmi Narayana
టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు ఎల్‌ రమణ సిద్ధం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మాది కూడా ఒక పార్టీ అన్నట్టుగా ఉన్నారు ఆ శిబిరంలోని నాయకులు. పెద్దగా ప్రజల్లోకి వెళ్లిందీ లేదు. ఇంతలో పార్టీ అధ్యక్షుడే గోడ దూకేందుకు సిద్ధమయ్యారు. చెక్‌పోస్టు పడకుండానే లోడ్‌ ఎత్తేయడానికి రెడీగా ఉన్నారు. మరి.. ఆయన స్థానంలో వచ్చేవారు ఎవరు? ఆ దిశగా కసరత్తు మొదలైందా లేదా?

తెలంగాణలో టీడీపీ బలంగా నిలబడే అవకాశం చిక్కలేదు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ వెలుగు వెలిగిన పార్టీ తెలుగుదేశం. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారిపోయింది. ఇప్పటికే పార్టీలో పెద్ద పెద్ద నాయకులంతా తలోదారి చూసుకున్నారు. ఉన్నవారిలో బెటర్‌ ఆప్షన్‌ అని ఎంపిక చేసి.. L రమణకు తెలంగాణ టీడీపీ బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే అధ్యక్షుడు. రాష్ట్రంలోని ప్రత్యేక రాజకీయ పరిస్థితుల కారణంగా బలంగా ప్రజల్లో నిలబడే అవకాశం టీడీపీకి చిక్కలేదు. ఎన్నిక ఏదైనా జనం మద్దతు కరువైంది.

సైకిల్‌ దిగి కారెక్కేందుకు రమణ సిద్ధం?

తెలంగాణ టీడీపీ నుంచి ఎంత మంది వెళ్లిపోయినా.. పార్టీలో నేనొక్కడినే అని ఎన్నోసార్లు ప్రకటించారు రమణ. ఇప్పుడు ఆయన వంతు కూడా వచ్చేసింది. సైకిల్‌ దిగి కారెక్కేందుకు రెడీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. రమణ నోటి నుంచి పార్టీ మార్పుపై స్పష్టమైన ప్రకటన చేయనప్పటికీ.. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మాత్రం పక్కాగా వినిపిస్తోంది. మరి.. రమణ వెళ్లిపోతే.. కొత్త సారథి ఎవరనే చర్చ తెలుగుదేశంతోపాటు.. రాజకీయవర్గాల్లోనూ మొదలైంది.

రమణ ప్లేస్‌లో టీడీపీ బాధ్యతలు ఎవరికి?

తెలంగాణలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో టీడీపీని నడిపించటం అంత సులువైన పని కాదు. ఈ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే క్యాడర్ కావాలి. నాయకులతోపాటు కేడర్‌ కూడా ఎక్కికక్కడ సర్దుకుంది. కొంతమంది నాయకులు మాత్రం మొదట్నుంచి పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. అలా ఉన్నవారిలో రమణ స్థానంలో పార్టీ బాధ్యతలు చేపడతారన్నది ప్రశ్నగా ఉంది.

అంతుచిక్కని చంద్రబాబు నిర్ణయం
పదవిని అడ్డం పెట్టుకుని ఇంకెవరైనా జంప్‌ చేస్తే?

ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో ఉన్నవారిలో రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డిలు మాత్రమే గతంలో చట్ట సభల్లో పనిచేశారు. పార్టీలో సీనియర్‌ నాయకులుగా అరవింద్‌ కుమార్‌ గౌడ్‌, బక్క నర్సింహులు ఉన్నారు. టీ టీడీపీలో ఉన్న నేతల గురించి బూతద్దం పెట్టి చూస్తే వీళ్లే కనిపిస్తున్నారట. అయితే చంద్రబాబు నిర్ణయం ఏంటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ నలుగురిలో ఒకరిని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని చేస్తారా లేక.. నాన్చి నాన్చి మరో కొత్త వ్యక్తిని తెరపైకి వస్తారా అన్నది ఒక ప్రశ్న. గతంలో టీడీపీలో నువ్వా నేనా అనుకున్న నాయకులంతా వెళ్లిపోయారు. ఉన్నకొద్దిమందీ అంటీముట్టనట్టు ఉంటున్నారు. సారథిగా బాధ్యతలు చేపట్టేవారికి పదవి అలంకార ప్రాయమే అనే ఒక అభిప్రాయం ఉంది. ఒకవేళ ఆ పదవిని అడ్డం పెట్టుకుని ఇంకెవరైనా జంప్‌ చేస్తే.. అది టీడీపీకి ఇంకా నష్టం చేకూరుస్తుంది.

ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సైతం జంప్‌

తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా.. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. టీడీపీ సోదిలో కూడా ఉండటం లేదు. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వయంగా ఎల్‌ రమణ పోటీ చేశారు. డిపాజిట్‌ కూడా దక్కలేదు. ఉన్న ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కండువా మార్చేశారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేయాలని అంటే బ్రహ్మాండం బద్దలవ్వాల్సిందే. ఇప్పటికే ఏపీ పాలిటిక్స్‌తో సతమతం అవుతున్న చంద్రబాబు.. తెలంగాణపై ఫోకస్‌ పెడతారా అన్నది కూడా డౌటే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • L Ramana
  • off the record
  • TDP Leader
  • telangana
  • Telangana TDP

తాజావార్తలు

  • Summer Tips: చీమల బెడద భరించలేకపోతున్నారా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో చెక్ పెట్టండి!

  • Sunil Gavaskar: వైభవ్ సూర్యవంశీ సిక్సులు కొడుతుంటే చూడలేకపోయా.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IMDb Best IPL Matches: ఇన్ని సీజన్లలో టాప్ 5 బెస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లు ఏవో తెలుసా..

  • KTR : జీవన్ రెడ్డి BRSలోకి… కేటీఆర్ హాట్ కామెంట్స్

  • Bangladesh Cricket: స్టేడియంలో కాఫీ ఖర్చంత కూడా లేని ఆ దేశ స్టార్ ప్లేయర్ల జీతాలు..!

ట్రెండింగ్‌

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions