Hyderabad: తెలంగాణలో ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై కొరడా.. 32 మెడికల్ షాపులకు నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pharmacy Raids- Hyderabad: ఆన్లైన్ ఫార్మసీల ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఔషధ విక్రయాలపై తెలంగాణ ఆహార, నిత్యావసర ఔషధాల ప్రమాణాల ప్రాధికార సంస్థ (TG SAFE) డ్రగ్స్ విభాగం కొరడా ఝుళిపించింది. 2026 అక్టోబర్ 28న ‘క్యూర్’ (CURE) ప్రాంతం పరిధిలోని ఆన్లైన్ మెడిసిన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు, వాటి అనుబంధ ఫార్మసీలపై అధికారులు ఆకస్మిక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. టీజీ సేఫ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పోలీసులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది సమన్వయంతో ‘డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940’ నిబంధనల అమలును పరిశీలించేందుకు ఈ తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో టాటా 1ఎంజీ (Tata 1mg), నెట్‌మెడ్స్ (Netmeds), జెప్టో (Zepto), అపోలో 24/7 (Apollo 24/7), మెడ్‌ప్లస్ మార్ట్ (MedPlus MART), ఇన్‌స్టామార్ట్ (Instamart) వంటి ప్రముఖ ఆన్లైన్ ఔషధ డెలివరీ సంస్థల ప్రాంగణాలు, వాటి నెట్వర్క్ భాగస్వామ్య మెడికల్ షాపులతో సహా మొత్తం 106 దుకాణాలను అధికారులు విస్తృతంగా పరిశీలించారు. ఈ డ్రైవ్‌లో తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. అమ్మకాల బిల్లులు చూపించకపోవడం, ప్రిస్క్రిప్షన్ డ్రగ్ రిజిస్టర్లు మరియు షెడ్యూల్ ‘హెచ్1’ (Schedule H1) ఔషధ రిజిస్టర్లను నిర్వహించకపోవడం, కొనుగోలు రసీదులు (Purchase Invoices) లేకపోవడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (వైద్యుల) ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు ఇవ్వడం, క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ పర్యవేక్షణ లేకుండా విక్రయాలు జరపడం, కొనుగోలు–అమ్మకాల రికార్డులను సక్రమంగా భద్రపరచకపోవడం వెలుగుచూశాయి.
Also Read
- Rudravanam PS: మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి ‘రుద్రవనం పీఎస్’ స్ట్రీమింగ్.!
- WPL 2027 Auction: వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌కు అత్యధిక ధర.. సోఫీ మోలినెక్స్ను సొంతం చేసుకున్న యూపీ వారియర్స్..
- Pocket Rockets: నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘పాకెట్ రాకెట్స్’.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో యూత్‌ఫుల్ డ్రామా.!
- Cyclone Arnab Alert: నేడు ఏపీలో భారీ వర్షాలు.. 11 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిన 32 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ‘డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940’ ప్రకారం తదుపరి కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆన్లైన్ వేదికలతో ముడిపడి ఉన్న దుకాణాలైనా సరే నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని హెచ్చరించారు. వ్యసనానికి గురిచేసే మందుల అక్రమ విక్రయాలు, మళ్లింపులు లేదా ఆన్లైన్ ఔషధ విక్రయాల్లో అక్రమాలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు పనిదినాల్లో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 అందుబాటులో ఉంటుందని టీజీ సేఫ్ ప్రకటించింది.
తాజావార్తలు
-
Hyderabad: తెలంగాణలో ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై కొరడా.. 32 మెడికల్ షాపులకు నోటీసులు
-
Kumar Sangakkara: విమానాశ్రయంలో వివక్ష.. సంగక్కర సంచలన ఆరోపణలు!
-
Rudravanam PS: మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి ‘రుద్రవనం పీఎస్’ స్ట్రీమింగ్.!
-
Amazon Layoffs 2026: అమెజాన్‌లో మరోసారి ఉద్యోగాల కోత.. పొద్దు పొద్దున్నే 250 మంది ఉద్యోగులకు షాక్!
-
WPL 2027 Auction: వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌కు అత్యధిక ధర.. సోఫీ మోలినెక్స్ను సొంతం చేసుకున్న యూపీ వారియర్స్..
ట్రెండింగ్
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..