Rudravanam PS: మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి ‘రుద్రవనం పీఎస్’ స్ట్రీమింగ్.!
- క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా ‘రుద్రవనం పీఎస్’
- ప్రధాన పాత్రలో నరేష్ అగస్త్య
- శశిధర్ మున్నంగి దర్శకత్వం
- అక్టోబర్ 30 నుంచి జీ5లో స్ట్రీమింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rudravanam PS OTT Release: ఎల్లో ఫ్లవర్స్, శ్రీ చక్ర మూవీస్ బ్యానర్లపై రమేష్ పుప్పాల, సూర్యకాంతి నిర్మాతలుగా శశిధర్ మున్నంగి దర్శకత్వంలో రూపొందిన సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘రుద్రవనం పీఎస్’. నటుడు నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ఓటీటీ వేదిక జీ5 (ZEE5)లో అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈవెంట్లో డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “మా నిర్మాత రమేష్ పుప్పాలని మళ్లీ ఇలా వేదికపై చూడటం చాలా ఆనందంగా ఉంది. ‘మిరపకాయ్’ సినిమా సమయంలో రమేష్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. రాజా రవీంద్ర సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇక వివేక్ కూచిభోట్ల నా కుటుంబ సభ్యుడి లాంటి వారు. ఆయన శ్రీమతి సూర్యకాంతి ఈ సిరీస్‌తో నిర్మాతగా పరిచయం కావడం సంతోషకరం. దర్శకుడు శశి ఈ సిరీస్‌తో ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నేను ఇప్పటికే ‘రుద్రవనం పీఎస్’ కంటెంట్ చూశాను. ఇది ప్రేక్షకులు ఊహించిన దాని కంటే చాలా పెద్ద విజయం సాధిస్తుందని గట్టిగా నమ్ముతున్నానని ధీమా వ్యక్తం చేశారు.
Also Read
హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ.. “దాదాపు పన్నెండేళ్ల క్రితం జీ5లో ‘పసుపు కుంకుమ’తో నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ‘పరువు’, ‘వికటకవి’ వంటి ప్రాజెక్ట్‌లు చేశాను. ఇప్పుడు ‘రుద్రవనం పీఎస్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. నాపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన సూర్యకాంతి, రమేష్ కి ధన్యవాదాలు. దర్శకుడు శశి, సినిమాటోగ్రాఫర్ అష్కర్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి దీనిని తెరకెక్కించారు. సినిమాలో ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌ను అందరూ తప్పక చూడాలని కోరారు.
దర్శకుడు శశిధర్ మున్నంగి మాట్లాడుతూ.. “‘రుద్రవనం పీఎస్’ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే సరికొత్త క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందింది. ప్రతీ ఎపిసోడ్ ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది. తెలుగు ఓటీటీ స్పేస్‌లో ఇదొక గొప్ప క్రైమ్ థ్రిల్లర్‌గా నిలుస్తుందన్న నమ్మకం ఉంది. మా ప్రయాణంలో అండగా నిలిచిన జీ5 టీమ్‌తో పాటు నిర్మాతలు, నటీనటులకు నా కృతజ్ఞతలు అని అన్నారు. చివరగా నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ.. హరీష్ శంకర్ ప్రోత్సాహం వల్లే తాను సినీ పరిశ్రమలోకి వచ్చానని, ఆయన ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మరో నిర్మాత సూర్యకాంతి మాట్లాడుతూ.. “సిరీస్‌లోని ప్రతీ ఎపిసోడ్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది, ఎక్కడా బోర్ కొట్టించదు. జీ5 అందించిన సహకారం మరువలేనిది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివేక్ కూచిభోట్ల, రాజా రవీంద్ర, నటీమణులు శ్రావణి రెడ్డి, సుగాలి సిలోని తదితరులు పాల్గొని సిరీస్ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
తాజావార్తలు
-
Rudravanam PS: మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి ‘రుద్రవనం పీఎస్’ స్ట్రీమింగ్.!
-
Amazon Layoffs 2026: అమెజాన్‌లో మరోసారి ఉద్యోగాల కోత.. పొద్దు పొద్దున్నే 250 మంది ఉద్యోగులకు షాక్!
-
WPL 2027 Auction: వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌కు అత్యధిక ధర.. సోఫీ మోలినెక్స్ను సొంతం చేసుకున్న యూపీ వారియర్స్..
-
Pocket Rockets: నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘పాకెట్ రాకెట్స్’.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో యూత్‌ఫుల్ డ్రామా.!
-
Cyclone Arnab Alert: నేడు ఏపీలో భారీ వర్షాలు.. 11 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
ట్రెండింగ్
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..