Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
- ఖైరతాబాద్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ సీరియస్ ప్లానింగ్..
- త్వరలోనే సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ భేటీ..
- పార్టీ అభ్యర్థిగా దానం నాగేందర్‌కే ఛాన్స్ ఇస్తారన్న టాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖైరతాబాద్ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది? పార్టీ అభ్యర్థి విషయంలో క్లారిటీ వచ్చేసిందా? ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉందా? పవర్లో ఉన్న పార్టీగా… బైపోల్ గెలుపు కోసం ఏం చేయాలనుకుంటున్నారు హస్తం పెద్దలు? ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మనసులో మాటేంటి?
ఖైరతాబాద్ ఉప ఎన్నిక కోసం తెలంగాణ రాజకీయ పక్షాలన్నీ సిద్ధమవుతున్నాయి. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ అయితే… అందరికంటే ముందుగానే అలర్ట్ అయిపోయి నాయకుల్ని అప్రమత్తం చేసే పని మొదలుపెట్టిందట. దీనికి సంబంధించి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ భేటీ అవబోతున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి ఖైరతాబాద్ ఉప ఎన్నిక అజెండాగానే ఆ మీటింగ్ ఉండవచ్చని అంటున్నారు. సీనియర్ నాయకులతో కూడా వీలైనంత త్వరగా సమావేశం కావాలన్న ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఖైరతాబాద్‌లో గెలిచి తీరాలన్న కసిగా ఉందట కాంగ్రెస్. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా…. ఇప్పుడు ఖైరతాబాద్ గెలుపు అనివార్యం అన్న ఫీలింగ్ ఉందని అంటున్నారు. పార్టీ అభ్యర్థిగా దానం నాగేందర్‌నే బరిలో దింపవచ్చని చెబుతున్నారు.
Also Read
బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించి.. కాంగ్రెస్‌లో చేరి… ఇంత జరిగాక కూడా… ఇప్పుడు ఆయనకు టిక్కెట్ ఇవ్వకపోతే రాజకీయంగా రాంగ్ ఇండికేషన్స్ వెళ్ళే అవకాశం ఉందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. దానంకు టిక్కెట్ నిరాకరిస్తే… పార్టీ ఫిరాయించి వచ్చిన మిగతా ఎమ్మెల్యేల్ని అనవసరంగా టెన్షన్ పెట్టినట్టు అవుతుందని ఓపెన్‌గానే మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఇలా… రకరకాల అంశాలను పరిగణనలోకి తీసుకుని చూస్తే… నాగేందర్ అభ్యర్థిత్వాన్నే కాంగ్రెస్ అధిష్టానం కన్ఫామ్ చేయవచ్చన్నది పార్టీ ఇంటర్నల్ టాక్. మిగతా ఆశావహులకు కూడా ఇదే విషయం చెప్పి నచ్చజెప్పాలనుకుంటున్నట్టు సమాచారం. ఖైరతాబాద్ నియోజకవర్గంలో… కాంగ్రెస్ బలంతో పాటు దానం నాగేందర్‌కు కూడా వ్యక్తిగతంగా కొంత బలం, బలగం ఉన్నాయి. మాస్లో ఫాలోయింగ్ ఉంది. మైనార్టీ ఓటు బ్యాంక్..వీటికి అదనం.
ఇలా… అన్ని విషయాల్లో తమకు అనుకూలమైన వాతావరణం ఉందని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. CM రేవంత్ రెడ్డి కూడా ఖైరతాబాద్ ఉప ఎన్నికను… గెలిచి తీరాలనే కసితో ఉన్నారట. ఇక్కడ విజయం సాధిస్తే… గ్రేటర్లో కూడా ఇమేజ్ పెరుగుతుందన్నది మరో లెక్క. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సునాయాసంగా గెలిచింది. ఆ ఊపుతోనే ఈసారి కూడా జెండా ఎగరేయాలని డిసైడ్ అయింది అధికార పార్టీ. అందుకు అణుగుణంగా పావులు కదపాలని డిసైడ్ అయ్యింది. ఆ క్రమంలోనే… సీఎం రేవంత్ తన వ్యూహానికి పదును పెట్టే పనిలో ఉన్నట్టు చెబుతున్నారు.
ప్రస్తుతం…సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల సభల పై ఫోకస్ పెడుతోంది కాంగ్రెస్ పార్టీ. అటు సీఎం రేవంత్ కూడా ఇదే పనిలో ఉన్నట్టు తెలిసింది. ఉప ఎన్నికకు కొంత సమయం ఉంది కాబట్టి… ఇంతలో గ్రౌండ్ లెవల్లో వర్కవుట్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్ మాదిరిగా…ఖైరతాబాద్‌లో కూడా Cm రేవంత్ తన వ్యూహాన్ని అమలుచేయాలని భావిస్తున్నారట. అందులో భాగంగానే…. మంత్రులకు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించబోతున్నారట. ఎట్టి పరిస్థితుల్లో… ఈ ఉప ఎన్నికలో గెలిచి ప్రతిపక్షం నోరు మూయించాలని కాంగ్రెస్ డిసైడైందని అంటున్నారు. సీఎం రేవంత్ కూడా ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో పాజిటివ్ దృక్పథంతో ఉన్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!