ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీల నాయకులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన రాజకీయాల్లో, సినీ రంగానికి చేసిన సేవలను కొనియాడుతున్నారు. కేవలం 9 నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడంపై నాయకులు స్పందించారు. ఎన్టీఆర్ తీసుకువచ్చిన కొన్ని పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఎంపీ నామా నాగేశ్వర్ రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,…
మండవ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు. అప్పట్లో టీడీపీ అధినేత ఎన్టీఆర్, చంద్రబాబులకు కుడిభుజంగా పేరుతెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత పొలిటికల్ తెరపై మండవ పేరు పెద్దగా వినిపించలేదు. కొన్నాళ్లు రాజకీయాల్లో సైలెంట్‌గా ఉన్నప్పటికీ.. మొన్నటి లోక్‌సభ ఎన్నికల ముందు గులాబీ కండువా కప్పుకొన్నారు. సీఎం కేసీఆర్ నేరుగా మండవ ఇంటికి వెళ్లి టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. రాజకీయంగా పాత పరిచయాలు.. స్నేహం ఉండటంతో సైకిల్ దిగి.. కారెక్కేశారు మండవ. ఆ సమయంలోనే…