Pawan Kalyan : పవన్ కామెంట్స్ తో టీడీపీ షాక్ లో ఉందా..? |
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కామెంట్లు టీడీపీని డిఫెన్సులో పడేసినట్టే కన్పిస్తోంది. పార్టీ ఆవిర్భావ సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్త పడతాననే పవన్ కామెంట్లతో, తమతో కలిసి పని చేయడానికి సంసిద్దతను పవన్ తన కామెంట్ల ద్వారా తెలిపారని జనమంతా భావించారు. అదే తరహాలో టీడీపీ కూడా అనుకుంది. ఆ తర్వాత ఒకట్రెండు సందర్భాల్లో కూడా పవన్ ఇదే తరహాలో మాట్లాడితే పొత్తు పక్కా అని తమ్ముళ్లూ ఫిక్స్ అయినట్టే కన్పించారు. చంద్రబాబు ఏం కోరుకుంటున్నారో, దానికి అనుగుణంగానే పవన్ స్పందించారు కాబట్టి.. పొత్తులపై స్పష్టత వచ్చేసినట్టేనని అనుకున్నారు. అయితే జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు, టీడీపీ షాక్ గురయ్యేలా చేశాయనే చెప్పాలి. ఇన్నాళ్లూ తాము తగ్గామని.. ఇకపై తాము తగ్గేదే లేదని చెప్పడమే కాకుండా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ తగ్గితే బాగుంటుందని పవన్ అనడంతో టీడీపీ ఒక్కసారిగా షాక్ కు గురైంది. పవన్ అలా ఎందుకన్నారు? అసలేం జరుగుతుందో అనేది టీడీపీకి అర్థం కావడం లేదట.
ఇప్పుడు దీనిపై విశ్లేషించుకునే పనిలో పడ్డాయి టీడీపీ వర్గాలు. అసలు పవన్ ఈ తరహా కామెంట్లు ఎందుకు చేశారన్న దానిపై ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారట తమ్ముళ్లు. ఇటీవల కాలంలో చంద్రబాబు చేసిన కామెంటే పవన్ తాజా సంచలనానికి కారణం అనే చర్చ, ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పొత్తును కోరుకుంటున్నామనే సంకేతం ఇస్తూ, మనది వన్ సైడ్ లవ్ అనే కామెంట్ చేశారు. ఇక ఇటీవలి కాలంలో జరిగిన మహానాడు సక్సెస్ తర్వాత ప్రభుత్వాన్ని, వైసీపీని ఉద్దేశించి వార్ వన్ సైడ్ అనే కామెంట్ చేశారు బాబు. ఇప్పుడీ కామెంటే పవన్ తగ్గేదేలే కామెంటుకు కారణంగా కన్పిస్తోందనే చర్చ జరుగుతోంది. వార్ వన్ సైడ్ అంటే తమను కూడా పట్టించుకోకుండా, ఎన్నికలకు వెళ్తామని చంద్రబాబు చెప్పారనేది జనసేనలో జరుగుతోన్న చర్చ. తమ అవసరం లేదనే రీతిలో చంద్రబాబు.. టీడీపీ వ్యవహరిస్తున్నప్పుడు, తామేమీ టీడీపీ వెంట పడడం లేదనే విషయాన్ని టీడీపీకి అర్థమయ్యేలా చెప్పడంతో పాటు, ఆ పార్టీకి ఓ ఝలక్ ఇవ్వడానికే పవన్ ఈ తరహా కామెంట్ చేశారా అనే చర్చ టీడీపీలో జరుగుతోందట.
Also Read
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
చంద్రబాబు వార్ వన్ సైడ్ కామెంట్ పవన్ ఉద్దేశించి కాదని అంటున్నారు కొందరు తమ్ముళ్లు. ఇదే సందర్భంలో పవన్ కామెంట్లపై వీలైనంత వరకు మౌనం పాటిస్తేనే మంచిదని అంటున్నారు. మహానాడు తర్వాత ఒంటరిగా ఎన్నికలకు వెళ్లినా, గెలుస్తామనే ధీమా చాలామంది కార్యకర్తల్లో ఉన్నా, నేతల్లో కాన్ఫిడెన్స్ కన్పించినా.. రిస్క్ తీసుకోకూడదనేది చాలామంది టీడీపీ నేతల భావన. పైగా ఎన్నికలకు మరో రెండేళ్లు టైమ్ ఉండడంతో, ఏం జరిగినా జరగొచ్చనే భావన కూడా ఉంది. దీంతో పవన్ విషయంలో వీలైనంత వరకు సంయమనం పాటిస్తే మంచిదనే చర్చ పార్టీలో సాగుతోంది. ఈ క్రమంలోనే పవన్ కామెంట్ల విషయంలో టీడీపీ నుంచి పెద్దగా స్పందనల్లేవు.
ప్రభుత్వ వ్యతిరేకత వున్నా, అది ఎంత వరకు కలిసి వస్తుందన్న డౌట్ టీడీపీ వర్గాల్లో వుంది. 2014లో పవన్ కాంబినేషన్ కలిసి వచ్చింది. ఇప్పుడు అదే కలిసి వచ్చే అవకాశం వుందని కొందరి అంచనా. పొత్తుల లెక్క వేరు, ఇప్పుడు పవన్ పెడుతున్న ఆప్షన్లు, షరతులు వేరు. టీడీపీ తగ్గడం అంటే తనను సీఎం చెయ్యడం అనేది పవన్ మాటలకు అర్థమని కొందరు టీడీపీ నేతలంటున్నారు. అదే నిజమైతే, పొత్తుల సమస్యను పరిష్కరించడం టీడీపీకి సమస్యే. అందుకే వీలైనంత వరకు కొన్నాళ్లు మౌనంగా వుండటమే మేలని టీడీపీ భావిస్తోంది.
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!