Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Is Pawan Kalyan Target Fixing

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారా?

Published Date :September 20, 2022 , 11:06 am
By Premchand Chowdary
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

జనసేనాని టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారా? వైసీపీని ఓడించడమే లక్ష్యమన్న పవన్ కల్యాణ్.. ఆ పార్టీలో తన పర్సనల్ టార్గెట్స్‌ లక్ష్యంగా పని మొదలు పెట్టారా? ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తూ.. ఆ నియోజకవర్గం నుంచే తొలి సమీక్షను మొదలు పెట్టడం వెనుక అసలు ఉద్దేశం శత్రువు ఓటమేనా..?

దసరా నుంచి ప్రారంభించాల్సిన బస్ యాత్రను వాయిదా వేసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ నియోజకవర్గాల వారీగా సమీక్షలకు సిద్ధం అవుతున్నారు. సంస్థాగతంగా పార్టీ శక్తిసామర్ధ్యాలు తెలుసుకోవడంతోపాటు…. ఎన్నికలకు పార్టీని సెట్‌ చేయడానికి వీలుగా సమీక్షలు చేస్తామని ప్రకటించారు పవన్. వచ్చే నెలలో మొదలయ్యే ఈ సమీక్షకు మొదటి నియోజకవర్గంగా విజయవాడ పశ్చిమను జనసేనాని ఫిక్స్ చేశారు.

Also Read

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
  • Off The Record : సర్ సర్వేకు మజ్లిస్ మార్క్ ట్రీట్‌మెంట్‌ మొదలైందా?
  • Off The Record : స్వరం మార్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి..?
  • Off The Record : కాంగ్రెస్ హనుమంతుడికి పవర్ సంజీవని దొరకదా..?

సహజంగా ఎన్నికలకు ముందు పార్టీలన్నీ సమీక్షలో పర్యటనలో పెట్టుకుంటూనే ఉంటాయి. అందులో ఆశ్చర్యం ఏం ఉండదు. అయితే కొన్ని నియోజకవర్గాలను… అక్కడ ఉన్న ప్రత్యర్ధులను టార్గెట్ చేస్తూ పెట్టే సమావేశాలు, సభలు, సమీక్షలకు కొంత ఆసక్తి ఉంటుంది. టీడీపీనే కాదు… చంద్రబాబునే ఓడించాలనే గట్టి పట్టుదలతో ఉన్న సీఎం జగన్ కుప్పం టార్గెట్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 22న జగన్ అక్కడ పర్యటించబోతున్నారు. ఇది ఏపీ పాలిటిక్స్ లో అటెన్షన్ డ్రా చేసింది.

అలాగే… ఇప్పుడు పవన్ కల్యాణ్‌ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచే 2024 ఎన్నికల పని మొదలు పెట్టడంతో అక్కడే ఎందుకు? అనే సందేహం అందరిలోనూ వచ్చింది. విషయం ఏంటంటే… ఆ నియోజకవర్గం మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ది. మంత్రిగా ఉండగా పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు వెల్లంపల్లి. 2009లో ప్రజారాజ్యం నుంచి ఇదే నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. వైసీపీలో చేరిన తర్వాత పవన్ పై వెల్లంపల్లి చేస్తున్న విమర్శలకు దీనితోనే జనసైనికులు కౌంటర్ ఇచ్చారు. అప్పట్లో సీటు కోసం… గెలిపించడం కోసం పవన్ కాళ్లా వేళ్లా పడ్డ వెల్లంపల్లి ఇప్పుడు ప్లేట్ మార్చారని ట్రోల్ చేశారు. అంతేకాదు… 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన వెల్లంపల్లి… విజయవాడ ప్రచారానికి వెళ్లిన పవన్ వెంటపడి…. తనను గెలిపించాలని ఓ సందేశం ఇవ్వాలని కోరిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టేశారు. అది చూసిన వెల్లంపల్లి అన్ననే గెలిపించని వాడు… బీమవరం, గాజువాకలో గెలవని వాడు తనను గెలిపించడమా? అంటూ పవన్‌ను ఎద్దేవా చేశారు.

అప్పట్లో మంత్రిగా ఉన్న వెల్లంపల్లి… జనసేనాని పవన్‌కు కనీస మర్యాద కూడా ఇవ్వకుండా విమర్శలు చేసేవారు. ఇది జనసైనికుల్లోనే కాదు… జనసేనాని మైండ్ లో బాగా ఫిక్స్ అయినట్టుంది. అందుకే … వెల్లంపల్లి ఓటమి టార్గెట్ గా అతని నియోజకవర్గం నుంచే పార్టీ సమీక్షలు మొదలు పెట్టబోతున్నారట జనసేనాని. 2014 ఎన్నికల్లో టీడీపీ బలపరచిన బీజేపీ నుంచి పోటీ చేసిన వెల్లంపల్లి 3 వేల ఓట్ల స్వల్ప తేడాతో వైసీపీ మీద ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్ధి పోతిన మహేష్ కు అక్కడ 22వేల 367 ఓట్లు వచ్చాయి. JSP రెబల్ అభ్యర్ధగా పోటీ చేసిన కోరాడ కు 12 వేల ఓట్ల వరకు వచ్చాయి. టీడీపీకి 50 వేల ఓట్లు పోలయ్యాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన వెల్లంపల్లికి 58వేల ఓట్లతో దాదాపు 8 వేల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఈ లెక్కలే ఇప్పుడు జెఎస్పీలో ఆశలు రేపుతున్నాయి. ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే కాస్త గట్టిగా కాన్సన్‌ట్రేషన్‌ చేస్తే చాలు వెల్లంపల్లిని ఓడించవచ్చనేది ఆ పార్టీ ఆలోచనట. ఒకవేళ టీడీపీ, బీజేపీతో కలిస్తే ఆ పని ఇంకా ఈజీ అవుతుందనేది జనసేన లెక్క. అందుకే ఆ నియోజకవర్గం నుంచే పవన్‌ సమీక్షలు స్టార్ట్ చేస్తున్నారట. విజయవాడ పశ్చిమ సమీక్ష తర్వాతి జాబితాలో పవన్ ను టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల నియోజకవర్గాలే ఉంటాయట.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chandra babu
  • Dasara
  • jana sena
  • pawan kalyan
  • Telugu Desam Party

తాజావార్తలు

  • IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!

  • LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..

  • Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..

  • KTR: రంగుల సినిమా చూపించి రేవంత్ అధికారంలోకి వచ్చాడు

  • Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్‌ప్లే + 7200mAh

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions