BJP : బీజేపీలో ఈటెల కొత్త సంప్రదాయానికి తెర లేపారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ నాయకుడు బీజేపీలో కొత్త సంప్రదాయానికి తెర లేపారా? వచ్చే ఎన్నికల్లో పలానా చోటు నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంలో ఆంతర్యం ఏంటి? అధిష్ఠానం చెప్పిందా.. లేక ఆయనే అడ్వాన్స్ అయ్యారా? కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి?
బీజేపీలో ఎంతటి పెద్దవాళ్లయినా సరే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయిస్తుంది. ఆ అధికారం రాష్ట్ర పార్టీ చేతిలో కూడా ఉండదు. అందుకే ఈ విషయంలో బీజేపీ నేతలు ఎవరూ బయటకు మాట్లాడరు. గట్టిగా ప్రశ్నిస్తే… అది పార్టీ డిసైడ్ చేస్తుందని చెప్పి తప్పించుకుంటారు. బీజేపీ చెబితే ఎక్కడి నుంచైనా బరిలో ఉంటామని మరో మాట దానికి జత చేస్తారు. ఈ సంప్రదాయానికి భిన్నంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల చేసిన ప్రకటన ప్రస్తుతం కాషాయ శిబిరంలో చర్చగా మారింది.
Also Read
- OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
- Off The Record: రొటీన్‌కు భిన్నంగా ఆ మౌనవ్రతం ఎందుకు?.. కోలగట్ల వైఖరిపై వైసీపీలో చర్చ
నిన్న మొన్నటి వరకు బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే సీఎం కేసీఆర్‌పై పోటీకి సై అంటూ వచ్చారు ఈటల రాజేందర్. అలాంటిది ఒక్కసారిగా తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించి సంచలనం రేపారు. ఈ అంశంపై ఇతర పార్టీల కంటే ఎక్కువ చర్చ జరుగుతోంది బీజేపీలోనే. గజ్వేల్‌లో పని ప్రారంభించానని.. ఆ నియోజకవర్గంపై కన్నేసినట్టు ఈటల తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ను ఓడిస్తానని ప్రకటించారాయన. మరో సువేందు అధికారిని అవుతానని బెంగాల్లో మమత బెనర్జీని ఓడించిన అంశాన్ని ప్రస్తావించారు ఈటల. దీంతో బీజేపీలో కొత్త సంప్రదాయానికి తెరలేపారని అనుకుంటున్నారు.
ఇదే సమయంలో ఈటల ప్రకటనపై బీజేపీలో ఇంకో చర్చ కూడా జరుగుతోంది. హుజురాబాద్‌ను ఆయన వదులుకొనే ప్రసక్తే లేదని.. అలాంటిది గజ్వేల్‌కు ఎలా వెళ్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే.. జాతీయ నేతల అనుమతితో ఈటల ఆ ప్రకటన చేశారని అభిప్రాయపడేవాళ్లూ ఉన్నారు. ఈ అంశంపై పార్టీ వర్గాలకే క్లారిటీ లేదట. రేపటి రోజున ఈటలను చూసి మరోనేత.. తాను హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తానని చెబితే పరిస్థితి ఏంటి అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారట. అయినా.. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి దగ్గరకు మమత బెనర్జీ వెళ్లింది తప్పితే.. మమతా బెనర్జీపై పోటీ చేస్తానని సువేందు సవాల్ చేయలేదని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట. సీటు విషయంలో స్పష్టత లేకపోవడం వల్లే చాలా మంది బీజేపీలో చేరేందుకు వెనకడుగు వేస్తున్నారని.. అలాంటిది ఈటల అలా ఎలా ప్రకటన చేస్తారని కరుడుగట్టిన నేతలు నిలదీస్తున్నారట. మరి.. ఈటల ప్రకటన వెనక అసలు సంగతేంటో కాలమే చెప్పాలి.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!