Site icon NTV Telugu

Off The Record: అరెరె.. ఛాన్స్ మిస్సయిందే..!

Banakacharla

Banakacharla

Off The Record: బనకచర్ల పాలిటిక్స్‌ బ్యాక్‌ఫైర్‌ అయ్యాయా? దాన్ని బేసుకుని తెలంగాణలో అధికార పార్టీని ఇరుకున పెడదామనుకున్న బీఆర్‌ఎస్‌ వ్యూహం వర్కౌట్‌ అవలేదా? గులాబీ పార్టీ రాజకీయ ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లిందా? అసలు బనకచర్ల బేస్ట్‌గా ప్లాన్‌ చేసిన పాలిటిక్స్‌ ఏంటి? ఇప్పుడు వాటి మీద ఎలాంటి చర్చ జరుగుతోంది?

Read Also: Dialogue War: వరంగల్లో పొలిటికల్ హీట్.. కొండా మురళి- ఎర్రబెల్లి ప్రదీప్ రావు మధ్య డైలాగ్ వార్

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య మరో జల వివాదంగా మారిన బనకచర్ల ప్రాజెక్ట్‌ ఎపిసోడ్‌ని సీరియ్‌గా తీసుకోవాలని భావించింది బీఆర్‌ఎస్‌. దానికి సంబంధించి ఆ పార్టీ నేత హరీష్‌రావు వరుస మీడియా సమావేశాలు పెట్టి… తెలంగాణ, ఆంధ్ర నీటి పంపకాల అంశాన్ని మరోసారి తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ మధ్య దోస్తానా .. అంటూ వాళ్ళిద్దరికీ ముడిపెట్టి రాజకీయ అంశంగా మలచాలని భావించిందట గులాబీ పార్టీ. తెలంగాణలోని అధికార కాంగ్రెస్‌ నాయకులు చాలా మంది ఇప్పటికే దీనిపై స్పందించారు. వాస్తవాలతో సంబంధం లేకుండా బీఆర్ఎస్‌ కేవలం నీళ్ళ మీద రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తోందని విమర్శించారు కూడా. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య ఆ పొలిటికల్‌ రచ్చ అలా జరుగుతుండగానే… కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో అంతర్‌ రాష్ట్ర వివాదాలున్నాయని, పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలున్నందున బనకచర్ల ప్రాజెక్టుకి అనుమతి ఇవ్వలేమని ప్రకటించింది. నిపుణుల కమిటీ తెలంగాణ వాదనని సమర్థించడంతో ఇష్యూ ఒకసారిగా సద్దుమణిగిపోయింది.

Read Also: Vismaya Mohanlal: కూతుర్ని హీరోయిన్ గా లాంచ్ చేస్తున్న మోహన్ లాల్

ఇక, రాజకీయ అవసరాలు కావచ్చు, నిపుణుల అభిప్రాయాలకు విలువ ఇచ్చి కావచ్చు. మొత్తం మీద బనకచర్లకు కేంద్రం రెడ్‌ సిగ్నల్‌ వేసేసింది. తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి బనకచర్ల ఎపిసోడ్‌తో పాటు కృష్ణా, గోదావరి బేసిన్స్‌లో తెలంగాణకి నీటి వాటా.. కేటాయింపులపై గట్టిగా వాదిస్తోంది. ఇక బనకచర్ల ఎపిసోడ్ తెరమీదకి వచ్చిన తర్వాత.. కేంద్ర మంత్రులకు విన్నవించడంతోపాటు సీడబ్ల్యుసీకి సంబంధించిన అన్ని వేదికల మీద అభ్యంతరాలు చెబుతూ వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఐదారు సార్లు కేంద్ర మంత్రులని కలసి సమస్య తీవ్రతను వివరించారు కూడా. దీనిపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఓపెన్‌గానే అందరినీ పిలిచారు. కేంద్రంపై రాజకీయంగా ఒత్తిడి చేయాలని, ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ నీటి వినియోగంపై ఎన్ఓసీ ఇచ్చి ప్రాజెక్టులు కట్టుకోవాలంటూ క్లారిటీగా చెప్పేశారాయన. తెలంగాణకి సమాచారం ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వబోమని గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన అంశాలను కూడా పదేపదే గుర్తు చేస్తూ వచ్చింది తెలంగాణ సర్కార్‌.

Read Also: CM Chandrababu: మహా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు..

అయితే, ఇక్కడే బీఆర్‌ఎస్‌ ప్లాన్‌ బెడిసి కొట్టిందని చెప్పుకుంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఈ అంశాన్ని వాస్తవాలతో సంబంధం లేకుండా రాజకీయం కోసం గులాబీ పార్టీ వాడుకోవాలని చూస్తోందన్నది తెలంగాణ కాంగ్రెస్‌ అభిప్రాయం. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెడ్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. అరెరె, వాళ్ళకో గొప్ప ఛాన్స్‌ మిస్‌ అయిపోయిందే అంటూ కాస్త వెటకారంగా మాట్లాడుతున్నారట కొందరు కాంగ్రెస్‌ నాయకులు. ఇటీవల అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. రాయలసీమకు నీళ్ల తరలింపు అంశంపై అప్పట్లో కేసీఆర్‌ చూపిన చొరవ, రాసిన లేఖలను బయటపెట్టింది. దీంతో ఈ ఎపిసోడ్‌లో సర్కార్‌ కొంత పై చేయి సాధించినట్టయిందన్న అభిప్రాయం వ్యక్తం అయింది. అదే జోష్‌లో కేంద్రం దగ్గర కూడా తన అభ్యంతరాలను వినిపించడం వల్లే రిజల్ట్‌ పాజిటివ్‌గా వచ్చిందన్నది ప్రభుత్వ వర్గాల అభిప్రాయం. ఇంత చేసినా.. చెప్పుకోవడంలో.. తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిందన్న అభిప్రాయం కూడా ఉందట కొన్ని వర్గాల్లో.. కేంద్ర ప్రభుత్వం బనకచర్లకు అనుమతి ఇవ్వబోమని ఇండికేషన్ ఇచ్చినా కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి వెంటనే స్పందన కనిపించలేదు. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోలేక పోయిందనే భావన పార్టీ నాయకుల్లో ఉందని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ నిజంగానే కేంద్ర ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్‌కు తలూపేసి ఉంటే.. దాన్ని ఆధారంగా చేసుకుని బీఆర్‌ఎస్‌ మనకు తాటాకులు కట్టేది కదా? వాళ్ళు అంతలా రాజకీయం చేయాలనుకుంటున్నప్పుడు మనం కనీసం చేసింది కూడా ఎందుకు చెప్పుకోలేక పోతున్నామన్న ఆవేదన ఉందట కాంగ్రెస్‌లోని కొన్ని వర్గాల్లో.. మొత్తం మీద ప్రాజెక్ట్‌ ఆగాక కూడా తెలంగాణ పాలిటిక్స్‌లో హీట్‌ పుట్టిస్తోంది బనకచర్ల.

Exit mobile version