YCP : ఆ నియోజక వర్గంలో ఎమ్మెల్యే టికెట్ కోసం గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయా..? |
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ జిల్లా వైసీపీలో కో-ఆర్డినేటర్లకు గడ్డుకాలం నడుస్తోంది. పశ్చిమ, దక్షిణ స్ధానాల్లో ఇంఛార్జుల పంచాయితీ చల్లారక ముందే.. తాజాగా తూర్పు నియోజకవర్గంలో తిరుగుబాటుకు చాప కింద నీరులా ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో అధికారపార్టీకి తూర్పు నియోజకవర్గం చాలా కీలకం. ఇక్కడ వరసగా మూడుసార్లు టీడీపీ గెలిచింది. 2019 ఎన్నికల్లోనే సిట్టింగ్ ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహం రచించినా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు అక్కడి టీడీపీలో అంతర్గత బలహీనతలు బయటపడి పరిస్థితిని మార్చేస్తున్నాయి. దీనిని గుర్తించిన వైసీపీ.. వచ్చే ఎన్నికల్లో పక్కాగా పోరాటం చేసేందుకు కొత్త వ్యూహం రచించింది. తూర్పు నియోజకవర్గంలో బలమైన సామాజికవర్గాలుగా ముద్రపడ్డ యాదవులు, మత్స్యకారులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అక్కరమాని విజయనిర్మలకు కోఆర్డినేటర్ బాధ్యతలతోపాటు విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్పర్సన్ పదవి అప్పగించింది. ఇదేస్ధానం నుంచి రెండుసార్లు ఓడిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీని చేసింది. అలాగే విశాఖ మేయర్ పదవిని గొలగాని హరి వెంకట కుమారికి కట్టెబ్టటింది. ఈ విధంగా బలమైన బీసీ యాదవ సామాజికవర్గానికి గాలం వేసింది అధికారపార్టీ. కానీ క్షేత్రస్థాయిలో సీన్ మారిపోయిందట.
కోఆర్డినేటర్‌గా అక్కరమాని విజయనిర్మల వర్గం ఒంటెద్దుపోకడలు పోతుందనే వాదన చినికి చినికి గాలివానగా మారుతోంది. పార్టీలో సీనియర్లకు గుర్తింపు ఇవ్వడం లేదనే అసహనం ముదిరి… ఆమెకు వ్యతిరేకంగా సమావేశాలు పెట్టే వరకు వెళ్లిందట. నియోజకవర్గ పరిధిలో జీవీఎంసీ 15 డివిజన్లు ఉండగా.. 11 చోట్ల వైసీపీ గెలిచింది. వీరిలో 10 మంది కార్పొరేటర్లు అక్కరమానిపై అసంతృప్తితో ఉన్నారట. ఈ ముసలం వెనక అసలు కారణం వచ్చే ఎన్నికల్లో తూర్పు టికెట్ కోసమే అనేది టాక్. గత ఎన్నికల్లో భీమిలికి చెందిన అక్కరమాని కుటుంబానికి తూర్పులో టికెట్ ఇచ్చింది వైసీపీ. వంశీకృష్ణ శ్రీనివాస్ టికెట్ ఆశించినా.. నిరాశే మిగిలింది. అప్పటి నుంచే అక్కమానికి.. వంశీకృష్ణకు విభేదాలు మొదలైనట్టు చెబుతారు.
Also Read
తూర్పు నియోజకవర్గంలో అక్కరమాని, వంశీకృష్ణ వర్గాల మధ్య అస్సలు పడటం లేదు. దానికితోడు కొద్దిరోజుల క్రితం పార్టీ ఆఫీసులో జరిగిన మీటింగ్‌లో ఎమ్మెల్సీ వంశీకృష్ణ తన మనసులోని మాటను చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్టు తెలిపారాయన. అయితే మేయర్ హరికుమారి భర్త శ్రీనివాస్ సైతం రేస్లోఉన్నట్టు సంకేతాలు ఇవ్వడంతో రాజకీయం రసకందాయంలో పడింది. ఈ పరిణామాలు అక్కరమాని శిబిరానికి మింగుడు పడటం లేదట. ఇటీవల చేపట్టిన వార్డు అధ్యక్షుల నియామకాల్లో సిఫారసులను ఆమె పక్కన పెట్టేశారట. తమకు అనుకూలంగా ఉన్నవారికే పట్టం కట్టారట.
నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దిగజారుతోందని.. మొదటి నుంచి వైసీపీలో పని చేస్తున్నవారికి కాకుండా.. కొత్త వారిని ప్రోత్సహిస్తున్నారని అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. త్వరలోనే పార్టీ పెద్దలను కలిసి కోఆర్డినేటర్‌ను మార్చాలని కోరబోతున్నారట. ఈ తిరుగుబాట రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నదే ఆసక్తికరం. కాకపోతే ఎన్నికల సమయానికి ఈ మూడు ముక్కలాట మరింత రాటు దేలుతుందని అనుమానిస్తున్నారట. మరి.. తూర్పు పంచాయితీకి పార్టీ పెద్దలు ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!