Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Good Governance First Year Program Takes An Unusual Turn In Kakinada

Off The Record: మీరు ఎమ్మెల్యేలు ఐతే సరిపోతుందా..? మా సంగతేంది..?

Published Date :July 17, 2025 , 10:00 pm
By Chandra Shekhar Pamena
  • కాకినాడ జిల్లాలో కాస్త తేడాగా సుపరిపాలనలో తొలి ఏడాది కార్యక్రమం ..
  • జిల్లాలో ఐదుగురు టీడీపీ, ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలు..
  • క్షేత్ర స్థాయిలో పార్టీ ద్వితీయ శ్రేణి నుంచి నిలదీతలు..
  • మమ్మల్ని పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్న లీడర్స్‌..
  • మీపాటికి మీరు సెటిలైపోయి మమ్మల్మి వదిలేశారంటూ అసహనం..
  • కార్యక్రమం మొదలుపెట్టి తప్పుకుంటున్న ఎమ్మెల్యేలు..
  • పనులు కూడా అందరికీ జరగడం లేదన్న అసహనం..
  • స్పెషల్‌ బెనిఫిట్స్‌ లేకుండా రాజకీయం ఎందుకన్న చర్చ
Off The Record: మీరు ఎమ్మెల్యేలు ఐతే సరిపోతుందా..? మా సంగతేంది..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: సుపరిపాలనలో తొలి ఏడాది కార్యక్రమం అక్కడి ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తోందా? సమాధానం చెప్పలేక స్వయంగా ఎమ్మెల్యేలే జారుకుంటున్నారా? ఇదెక్కడి గొడవరా బాబూ అనుకుంటూ తలలు పట్టుకుంటున్నారా? మీరు ఎమ్మెల్యేలు అయితే సరిపోతుందా… మా సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నదెవరు? టీడీపీ ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న ఇబ్బందులేంటి?

Read Also: Crime News: ప్రియుడు కాదు.. ఆమె పాలిట యముడు..!

అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి ఏడాది కార్యక్రమం నిర్వహిస్తోంది టీడీపీ. నెల రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటించాలన్నది ప్రోగ్రామ్‌ లక్ష్యం. ప్రభుత్వ కార్యక్రమాలు లబ్ధిదారులకు ఏ విధంగా అందుతున్నాయి.. ఆ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులేంటి? అన్న విషయాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నది దీని ఉద్దేశ్యం. మిగతా చోట్ల ఆ వ్యవహారం ఎలా ఉన్నా….కాకినాడ జిల్లాలో మాత్రం కాస్త తేడాగా జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఐదుగురు టిడిపి ఎమ్మెల్యేలు, రెండుచోట్ల జనసేన శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలా… ఐదుగురు ఎమ్మెల్యేలు ,ఇద్దరు ఇన్ఛార్జ్‌లు టీడీపీ తరపున ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా… క్షేత్ర స్థాయికి వెళ్ళేసరికి వాళ్ళకు రకరకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయట. అదీకూడా పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు నుంచి కావడంతో… ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్‌లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది.

Read Also: Off The Record: ఉత్తరాంధ్ర నేతలు ఫెయిల్ అవుతున్నారని సీఎం కోపంగా ఉన్నారా?

తమను కనీస మాత్రంగా కూడా పట్టించుకోవడం లేదని తెగ ఫీల్ అయిపోతున్నారట సదరు నాయకులు. కొన్నిచోట్ల అయితే ఎమ్మెల్యేలను డైరెక్ట్‌గానే నిలదీస్తున్నట్టు చెబుతున్నారు. మీకేం…. మీ పాటికి మీరు.. మీరు సెటిలైపోయారు. మమ్మల్ని మాత్రం వదిలేశారంటూ డైరెక్ట్ అటాక్ చేసేస్తున్నారట. మాతో పని అయిపోగానే…ఇలా గాలికి వదిలేస్తారా? మళ్ళీ నాలుగేళ్ళ తర్వాత చూసుకోవచ్చని అనుకుంటున్నారా అంటూ… కడిగి పారేస్తున్నట్టు సమాచారం. నామినేటెడ్ పదవులు, పథకాల విషయంలో పెద్దగా ప్రాధాన్యత లేదని ఫీల్ అవుతున్నారట చాలామంది తమ్ముళ్ళు. ప్రభుత్వం తరఫున బీసీ, ఎస్సీ లోన్లు ప్రకటించింది…. అందుకోసం దరఖాస్తులు కూడా స్వీకరించారు.. అయితే ఉన్న యూనిట్లకు పదింతలు అప్లికేషన్లు రావడంతో తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టారు అధికారులు. దానిపై కూడా గుర్రుగా ఉన్నారట టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు. సాధారణ ఓటర్లకు ఏ విధంగా లబ్ది చేకూరుతోందో… తమకు అవే వస్తున్నాయి తప్ప కొత్తగా.. మీరు పొడిచిందేంటి… మాకు చేసిందేటని గట్టిగా నిలదీస్తున్నట్టు తెలుస్తోంది. కాంట్రాక్టుల్లో కూడా తమను పరిగణలోకి తీసుకోవడం లేదని గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారట.

Read Also: Vijayawada Double Murder: బెజవాడ వీధుల్లో వీరవిహారం.. ఇద్దరు యువకులను కిరాతకంగా హత్య చేసిన రౌడీ షీటర్..!

పార్టీ కోసం, ఎమ్మెల్యే కోసం ఎంతో చేశాం… అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఆ ఊసే ఎత్తడం లేదంటూ బరస్ట్ అయిపోతున్నట్టు తెలుస్తోంది. కలవడానికి వస్తే… కనీసం టైం ఇవ్వడం లేదంటూ… ఇప్పుుడు తమ గుమ్మం దగ్గరికి వచ్చిన వాళ్ళని నిలదీస్తున్నారట. దీంతో ఈ వ్యవహారం ఎమ్మెల్యేలకు తల నొప్పిగా మారిందన్న వాదన బలపడుతోంది. ఈ నిలదీతల దెబ్బకు కార్యక్రమాన్ని మొదలుపెట్టి….ఇక మీరు చూస్కోండని లోకల్ లీడర్స్‌కు అప్పగించేసి… ఎమ్మెల్యేలు పక్కకు తప్పుకుంటున్నట్టు సమాచారం. ఇది గమనిస్తున్న నాయకులు ఏ మాత్రం తగ్గడం లేదట. ఎలక్షన్ టైంలో మేం కావాలి…. ఏదన్నా పని అడిగితే మాత్రం చల్లగా జారుకుంటారా… మాకూ మళ్ళీ టైం వస్తుందంటూ స్మూత్ గా వార్నింగ్ ఇస్తున్నారట. పదవులు పందేరంలో కూడా… పార్టీ కోసం డెడికేటెడ్‌గా పని చేసిన వాళ్ళని కాదని.. వెయిట్ ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో జనసేనకి ఉన్న ప్రాధాన్యత కూడా తమకు లేదని సైకిల్ పార్టీ నియోజకవర్గ స్థాయి లీడర్లు తెగ డిస్కషన్ చేసేస్తున్నారట.

Read Also: Poolachokka Naveen: నెగిటివ్ రివ్యూ కేసు.. పోలీసుల అదుపులో యూట్యూబర్ పూలచొక్క నవీన్..

వాళ్లు ఎమ్మెల్యేలు అయిపోయారు ఇక మనల్ని ఎందుకు పట్టించుకుంటారంటూ… సోషల్ మీడియాలో పోస్టింగ్స్‌ పెట్టేస్తున్నారు. పనుల విషయంలో కూడా ఆ కొందరికే టిక్ పెడుతున్నారంటూ క్లారిటీగా చెప్పాల్సింది చెప్పేస్తున్నారు. అవసరం ఉన్నప్పుడు ఓడ మల్లన్న, తీరాక బోడి మల్లన్న అంటే…. ఆ రాజకీయాలు ఎక్కువ రోజులు సాగవని ఎమ్మెల్యేలకు గుర్తు చేస్తున్నారట నియోజకవర్గ నేతలు. మనకి స్పెషల్ బెనిఫిట్స్ లేకుండా రాజకీయాలు చేయడం అనవసరం అని టీడీపీ లీడర్స్‌ వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సుపరిపాలనలో తొలి ఏడాది కార్యక్రమంలో టిడిపి ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్లను తమ్ముళ్ళు ఏకి పడేస్తున్నారు. దాంతో అటు ఇటు తిరిగి ఎక్కడ తేడా కొడుతుందోననుకుంటూ… ఎమ్మెల్యేలు గాయబ్‌ అవుతున్నట్టు సమాచారం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • good governance
  • Kakinada
  • off the record
  • tdp

తాజావార్తలు

  • KKR vs SRH Playing 11: కేకేఆర్ vs ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్.. ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్ ఇదే!

  • Iran-Israel War: ఇరాన్‌‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఐఆర్‌జీసీ, క్షిపణి స్థావరాలపై ఎటాక్

  • Chiranjeevi: అయోధ్య ‘సూర్య తిలకం’ లాగే చిరంజీవి ఇంట్లో అద్భుతం.. వీడియో వైరల్!

  • Komurakka : ‘జబర్దస్త్’ కొమురక్కపై దాడి.. పక్కా స్కెచ్‌తో చుట్టుముట్టిన దుండగులు!

  • Raghav Chadha: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు ఆప్ షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions