Ex Minister Paleti:మాజీ మంత్రి పాలేటి … పరిస్థితి ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆయనో మాజీ ఎమ్మెల్యే. అప్పట్లో మంత్రిగా కొన్నాళ్లున్నారు. అయినప్పటికీ ఏ పార్టీలోనూ పట్టుమని పదేళ్లపాటు కొనసాగలేని పరిస్థితి. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండాలా.. రిటైర్ అవ్వాలా అన్నట్టుగా ఉన్న పొలిటికల్ కెరియర్‌కు అనుచరుడి కామెంట్స్ తలనొప్పి తెచ్చాయా? గండం నుంచి గట్టెక్కేందుకు ఎవరి మద్దతు కూడగట్టాలో అర్థం కావడం లేదా? ఎవరా నాయకుడు? ఏమా కథ?
స్థిరమైన ఆలోచన లేదని పాలేటిపై విమర్శ
పాలేటి రామారావు. చీరాల మాజీ ఎమ్మెల్యే. 1994, 1999లో చీరాల నుంచి టీడీపీ తరఫున రెండుసార్లు గెలిచారు. 1994లో కొణిజేటి రోశయ్యపై గెలుపొందటంతో ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రి అయ్యారు పాలేటి. ఆ తర్వాత చీరాలను పదేళ్లపాటు శాసించారు. 2004లో తిరిగి కొణిజేటి రోశయ్యపై ఓడి 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరినా 2019 ఎన్నికల టైమ్‌కు మళ్లీ టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. కొద్దికాలానికే ఎమ్మెల్యే కరణం బలరాం ఆయన తనయుడు కరణం వెంకటేష్‌తో కలసి వైసీపీ గూటికి చేరుకున్నారు పాలేటి. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మినహా ఎప్పుడూ ఓ స్థిరమైన ఆలోచన లేదనే విమర్శ పాలేటిపై ఉంది.
Also Read
అప్పట్లో రోశయ్యపై గెలిచారనే తప్ప సాధించింది ఇంకేమీ లేదా?
పాలేటి రామారావు పొలిటికల్ కెరియర్ను పరిశీలిస్తే.. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో.. ఎవరికి మద్దతుగా నిలుస్తారో చెప్పడం కష్టమంటారు అనుచరులు. అప్పట్లో ఎన్టీఆర్ గాలిలో కొణిజేటి రోశయ్యపై గెలిచారన్న క్రెడిట్ తప్ప రాజకీయంగా ఆయన సాధించిందేమీ లేదని స్థానికంగా చెప్పుకొంటారు. ఆయన ఉన్న పార్టీలో తనకు పనులు జరుగుతున్నంత వరకూ ఓకే.. లేకపోతే పెట్టే బేడా సర్దేస్తారనే విమర్శ ఉంది. ఇప్పటి వరకూ రాజకీయ మిత్రులుగా ఉన్న పాలేటి.. ఎమ్మెల్యే కరణం బలరాం మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందట. ఇటీవల అనుచరులతో వరస సమావేశాలు నిర్వహిస్తోన్న పాలేటి.. తనను రాజకీయంగా పక్కన పెట్టారని.. బలరాం గెలుపుకోసం తాను ఎంతో కృషి చేసినా అన్యాయం చేస్తున్నారని వాపోయారట. ప్రస్తుతం వైసీపీలో తన మాట చెల్లుబాటు కావటం లేదని.. పనులు కాకుండా ఓ కీలక నేత అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారట పాలేటి.
టీడీపీలో మళ్లీ కర్చీఫ్ వేయడానికి సిద్ధంగా ఉన్నారా?
ఎలాగూ టీడీపీ చీరాల నియోజకవర్గం బెర్తు ఖాళీగా ఉండటంతో అక్కడ ఓ కర్చీఫ్ వేసేందుకు సిద్దమవుతున్నారనే టాక్ నడుస్తోందట. ఇప్పటి వరకూ నేతలంతా పాలేటిని వాడుకుని వదిలేశారన్న సింపతి వర్కవుటైతే ఇంకోసారి ఎమ్మెల్యేగా గెలవాలన్న ఆశలోఉన్నారట. సరిగ్గా ఇదే సమయంలో ఆయన అనుచరుడు గవిని శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. చీరాల మాజీ ఎంపీపీ, ప్రస్తుతం ఏపీ పట్టణ మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్ డైరెక్టరైన గవినిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. అంబేద్కర్‌ను దూషించారని ఆరోపిస్తూ వైసీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకే గవినిపై కేసు పెట్టారు. ఇదే అంశంపై జిల్లాలో ప్రజా సంఘాలు, దళిత సంఘాలు ఆందోళనలు చేపట్టడంతో రాజకీయం హీటెక్కింది.
వైసీపీ నేతలు పాలేటికి సహకరించే పరిస్థితి లేదా?
తాజా వివాదంలోకి ఎంట్రీ ఇచ్చిన పాలేటి.. తన అనుచరుడు గవిని తరఫున క్షమాపణలు కూడా చెప్పారట. అయిప్పటికీ దళిత సంఘాలు గవినిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పాలేటికి ఏమీ పాలుపోవడం లేదట. తన ఒక్కగానొక్క ప్రధాన అనుచరుడ్ని ఈ వివాదం నుంచి ఎలా బయటపడేయాలో అర్థం కావడం లేదట పాలేటికి. రాజకీయంగా తిరిగి కరణం దగ్గరకో లేక ఇతర వైసీపీ నేతల వద్దకో వెళ్లి కేసు రాజీ చేయించలేకపోతున్నారట. పాలేటి టీడీపీలోకి వెళ్తున్నారన్న ప్రచారంతో వైసీపీ నేతలు ఆయనకు సహకరించే పరిస్థితి లేదని టాక్. అటు టీడీపీ నుండి స్పష్టత లేకపోవటం.. ఆయనపై చంద్రబాబుకు సరైన నమ్మకం లేక.. విపక్ష పార్టీ నేతలు కూడా పరోక్షంగానైనా మద్దతిచ్చే అవకాశం కనిపించడం లేదు.
బీసీలు పాలేటిని విశ్వసించడం లేదా?
బీసీలు ఎక్కువగా ఉండే చీరాలలో తానే పెద్ద బీసీ నేతను అని చెప్పుకొంటారు పాలేటి. అయితే తమకు ఆయన చేసింది ఏమీ లేదని నిట్టూరుస్తూ బీసీ నేతలు పాలేటి వెంట నిలవడం లేదట. దీంతో మాజీ మంత్రి అవుట్ డేటెడ్ లీడర్‌గా మారిపోయారన్న అభిప్రాయం జనాల్లో ఉన్నట్టు అనుచరులే చెవులు కొరుక్కుంటున్నారట. మరి.. కేసు నుంచి అనుచరుడిని ఎలా కాపాడుకుంటారో.. రాజకీయ భవిష్యత్‌ను ఏ విధంగా చక్కదిద్దుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?