OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
- ఉమ్మడి తూ.గో. జిల్లాలో 9 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలకు ఎన్నికలు
- టీడీపీ ఎమ్మెల్యేలే రిజర్వేషన్లు ఖరారు చేశారని గుసగుసలు
- రిజర్వేషన్లతో పోటీ చేసే అవకాశం కోల్పోయిన కొందరు బీజేపీ, జనసేన నేతలు
- ముందు బీసీ మహిళకు రిజర్వ్ అయిన కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవి
- టీడీపీ నేతల అసంతృప్తితో జనరల్ మహిళకు మార్చారనే వార్తలు
- పోటీ చేసే అవకాశం కోల్పోయిన పిక్కి నాగేంద్ర, డేగల రాము..?
- నిడదవోలు మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవిని ఎస్సీకి రిజర్వు
- రిజర్వేషన్‌తో పోటీ అవకాశం కోల్పోయిన తాజా మాజీ చైర్మన్ ఆదిబాబు
- టీడీపీ నేతలు చక్రం తిప్పి తమ అవకాశాలను దెబ్బతీశారనే ఆరోపణలు
- మండపేట చైర్పర్సన్ పదవికి బీజేపీ, జనసేన నుంచి ఆశావహులు లేరా..?
- అమలాపురం మున్సిపాలిటీలో గత ఎన్నికల్లో 6 కౌన్సిలర్ స్థానాలు గెలిచిన జనసేన
- పెద్దాపురం మున్సిపాలిటీని తమకు ఇవ్వాలంటూ జనసేన డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మున్సిపోల్స్ రిజర్వేషన్లు కూటమిలో కుంపట్లకు కారణమవుతున్నాయట. ఉమ్మడి తూ.గో. జిల్లాలో 9 మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. చైర్ పర్సన్లతోపాటు, కౌన్సిలర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రిజర్వేషన్ ఖరారులో టీడీపీ ఎమ్మెల్యేలు మాటే చెల్లుబాటైందన్న మాటలు వినిపిస్తున్నాయి. జనసేన, బీజేపీల ప్రమేయం లేకుండా టీడీపీ ఎమ్మెల్యేలు రిజర్వేషన్లను ఖరారు చేశారని కూటమిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రిజర్వేషన్ల కారణంగా పలుచోట్ల జనసేన, బీజేపీ నేతలు మున్సిపల్ చైర్పర్సన్ పదవులకు పోటీ చేసే అవకాశం కోల్పోయారట. నిడదవోలు, కొవ్వూరు, మండపేట, తుని, రామచంద్రాపురం, పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలు టీడీపీకి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమలాపురం, పిఠాపురం మున్సిపాలిటీలు జనసేన దక్కే ఛాన్స్ ఉంది. ముమ్మిడివరం, ఏలేశ్వరం నగర పంచాయతీలు కూడా టీడీపీకే లభించే అవకాశం ఉంది. గొల్లప్రోలు నగర పంచాయతీలో కూడా జనసేనకే ఛాన్స్ ఉంది. కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని ముందు బీసీ మహిళలకు రిజర్వ్ చేశారు. దీనిపై టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో రిజర్వేషన్ మార్చి జనరల్ మహిళకు కేటాయించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, జనసేన పట్టణ అధ్యక్షుడు డేగల రాము పోటీ చేసే అవకాశం కొల్పోయారట. కనీసం తమ భార్యలను కౌన్సిలర్లుగా పోటీ చేయించి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పదవి అయినా పొందాలనుకుంటే వార్డుల్లో రిజర్వేషన్లు మార్పు చేసి పోటీ చేయడానికి అవకాశం లేకుండా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవికి కూటమి అభ్యర్థిగా టీడీపీ ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ భార్య కంఠమణి విజయలక్ష్మి బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. నిడదవోలు మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవిని ఎస్సీ రిజర్వు స్థానంగా ప్రకటించారు. జనసేన నుంచి ఓసీ జనరల్ అభ్యర్థులు నిడదవోలు మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఆశించారు. తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆదిబాబు మళ్ళీ పోటీ చేయాలనుకున్నారు. అయితే రిజర్వేషన్ కారణంగా అవకాశం కోల్పోవాల్సి వచ్చింది. టీడీపీలో టిక్కెట్టు ఆశిస్తున్నవారిలో ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. నిడదవోలు మున్సిపాలిటీని దక్కించుకునేందుకు రిజర్వేషన్ విషయంలో టీడీపీ నేతలు చక్రం తిప్పి తమ అవకాశాలను దెబ్బతీశారని మిగతా రెండు పార్టీల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయట. ఇక మండపేట మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఓసీ జనరల్‌కు రిజర్వ్ అయింది. ఆర్థికంగా బలమైన అభ్యర్థులు ఇక్కడ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. కానీ… ఆర్థికంగా బలమైన అభ్యర్థులు కూటమిలో టీడీపీకి మాత్రమే ఉన్నారు. అంగబలం, అర్థబలం లేకపోవడంతో జనసేన, బీజేపీ నుంచి ఎవరూ చైర్పర్సన్ పదవి ఆశించడంలేదట. అమలాపురం మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దీనిపై తీవ్ర ఒత్తిడి రావడంతో ఓసీ జనరల్‌కు మార్పు చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓసీ జనరల్ కావడంతో టీడీపీ, జనసేన మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గత మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఆరు కౌన్సిలర్ స్థానాలను గెలిచి ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. టీడీపీకి 4 కౌన్సిలర్ పదవులు మాత్రమే దక్కాయి. అమలాపురంలో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసినా గెలుస్తుందని లెక్కలు చూపించి చైర్పర్సన్ పదవి కోసం గట్టిగా పట్టుబడుతున్నారట. దాంతో అమలాపురం మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిత్వం కూటమి తరపున జనసేనకే దక్కే అవకాశాలున్నాయి. ఇక పెద్దాపురం మున్సిపాలిటీని తమకు ఇవ్వాలంటూ జనసేన డిమాండ్ చేస్తోంది. గొల్లప్రోలు చైర్పర్సన్ పదవిని టీడీపీ బలంగా కోరుకుంటోంది. అయితే… పట్టువిడుపులు అంటూ లేకపోవడంతో… మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిత్వాల అంశం… కూటమిలో విభేదాలకు కారణమవుతోందట. ఒక పార్టీకి అభ్యర్థిత్వం దక్కితే… మిగతా రెండు పార్టీలు ఎంతవరకూ సహకరిస్తాయనేది ప్రశ్నార్ధకంగా మారిందట. టికెట్ లభించకపోతే ఆశావాహుల్లో కొంతమంది పార్టీ మారే పరిస్థితులు కూడా ఉన్నాయట. అభ్యర్థిత్వాలు ఖరారయ్యాక కూటమిలో కుమ్ములాటలు బయటపడటం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి.
Also Read
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
- OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
- OTR : నువ్వు అక్కడ.. నేను ఇక్కడ.. ఎమ్మెల్సీ బరిలో బీఆర్ఎస్, బీజేపీ సరికొత్త వ్యూహం
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!