Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Differences Between Minister Konda Surekha And The Principal Secretary

Off The Record: మంత్రి కొండా సురేఖకు ఓ ముఖ్య కార్యదర్శికి పడటం లేదా..?

Published Date :July 3, 2025 , 9:45 pm
By Chandra Shekhar Pamena
  • మంత్రి కొండా సురేఖకు, ఓ ముఖ్య కార్యదర్శికి పడటం లేదా?..
  • ఫైళ్ళ క్లియరెన్స్ విషయంలో ఇద్దరికి విభేదాలు వచ్చాయా?..
  • రూల్స్‌కు విరుద్ధమంటూ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ పక్కన పెట్టేశారా?..
  • 29 మందికి ప్రమోషన్‌ ఇచ్చే విషయంలో ఇద్దరికి విభేదాలు?..
  • ఫైల్‌ పంపమని మంత్రి చెప్పినా ఐఎఎస్‌ పట్టించుకోలేదా?..
  • ప్రమోషన్‌ ఇచ్చే అధికారం తనకే ఉందని అధికారి అనుకున్నారా?..
  • అవినీతి అధికారిపై చర్యల విషయంలో కూడా విభేదాలున్నాయా?..
  • పనిష్మెంట్‌ ఇవ్వవద్దని ఫైల్‌ మీద మంత్రి నోట్‌ రాశారా?..
  • ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నేరుగా సీఎస్‌కు పంపారా?..
  • ఐఎఎస్‌ మీద మంత్రి సీఎంవోకు ఫిర్యాదు చేశారా?
Off The Record: మంత్రి కొండా సురేఖకు ఓ ముఖ్య కార్యదర్శికి పడటం లేదా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: ఆ శాఖలో.. మంత్రికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి అస్సలు పొసగడం లేదా? ఇద్దరి మధ్య ఒక రకంగా కోల్డ్‌ వార్‌ నడుస్తోందా? ఇద్దరి వ్యవహారం ఎడ్డెమంటే తెడ్డెమన్నట్టుగా ఉందా? మంత్రి ఆదేశించినా ఆ ఐఏఎస్ ఎందుకు మాట వినడం లేదు? మినిస్టర్‌ చెప్పినట్టల్లా సంతకాలు చేస్తే రేపు తానే ఇరుక్కుంటానని భయపడుతున్నారా? లేక ఇతర ఇగో సమస్యలున్నాయా? ఎవరా ఆఫీసర్‌? ఆయన మీద సీఎంవోకి ఫిర్యాదు చేసిన మంత్రి ఎవరు?

Read Also: Most-Wanted Terrorists: ఏపీలోని ఆ రెండు జిల్లాల్లో ఉగ్రమూకల కలకలం..

Also Read

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
  • Off The Record : పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య మంటలు
  • Off The Record : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా?
  • Off The Record : ఎమ్మెల్యే పేరు చెప్పి పత్తిపాడు నియోజకవర్గంలో కమీషన్ల దందా

ఫైళ్ళ క్లియరెన్స్ విషయంలో మంత్రికి, ముఖ్య కార్యదర్శికి మధ్య విభేదాలు ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలో హాట్‌ టాపిక్‌ అయ్యాయి. మంత్రి తీసుకున్న నిర్ణయాలు రూల్స్‌కు అనుగుణంగా ఉంటే…సంబంధిత శాఖ కార్యదర్శి వాటిని అమలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ విరుద్ధంగా ఉంటే మాత్రం సరైన సలహాలు ఇచ్చి సవరించుకునే విధానాన్ని వివరించాలి. ఇక్కడే మంత్రి కొండా సురేఖకు, తన శాఖ పరిధిలోని ఓ ముఖ్య కార్యదర్శి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకున్నట్లు సమాచారం. కొన్ని ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో మంత్రి, ముఖ్య కార్యదర్శి మధ్య విభేదాలు ఎంతకీ సమసిపోవడం లేదట. తన నిర్ణయాన్ని అమలు చేయాల్సిందేనని మంత్రి పట్టుబడుతుండగా.. రూల్స్‌కు విరుద్ధంగా ఉన్నాయంటూ ఆఫీసర్ పక్కన పెడుతున్నట్టు సమాచారం. ఈ మధ్య ఓ ఫైల్ పై మంత్రి సంతకం చేసినా… అమలు చేయకుండా ఆ ఫైల్‌ను నేరుగా చీఫ్ సెక్రెటరీ ఆమోదం కోసం పంపడం సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొండా సురేఖ పరిధిలోని ఓ శాఖకు చెందిన 29 మందికి ప్రమోషన్ ఇచ్చే విషయంలో.. ఆమెకు, ప్రిన్సిపల్ సెక్రెటరీకి మధ్య విబేధాలు వచ్చినట్టు తెలుస్తోంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన 20 పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసేందుకు ముఖ్య కార్యదర్శి అనుమతి ఇచ్చారని తెలిసింది. విషయం తెలుసుకున్న మంత్రి సదరు ఫైలును తనకు పంపాలని ఆదేశించినా.. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం.

Read Also: Bengaluru: ఎక్ట్రా కప్పు ఇవ్వనందుకు కాఫీ షాప్ సిబ్బందిని చితకబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

అయితే, బిజినెస్ రూల్స్ ప్రకారం వారికి ప్రమోషన్ ఇచ్చే అధికారం ఆ శాఖ హెచ్ఓడికి మాత్రమే ఉందని, అందుకు మంత్రి ఆమోదం అవసరం లేదని నిర్ణయానికి వచ్చిన ప్రిన్సిపల్ సెక్రెటరీ.. ఆ ఫైల్‌ను మంత్రి పేషీకి పంపడం లేదని తెలిసింది. ఇక్కడే ఇద్దరి మధ్య తేడా కొట్టిందని అంటున్నారు. ఆ ఫైల్ తనకు పంపాలని మంత్రి ఒత్తిడి చేయడం, ఆమె దగ్గరకు అవసరం లేదని ఉన్నతాధికారి భావించడంపై సెక్రెటేరియట్ వర్గాల్లో రక రకాల చర్చలు జరుగుతున్నాయి. సురేఖ పరిధిలోని ఓ శాఖకు సంబంధించిన భూమిని కాపాడాల్సిన అధికారి ఒకరు దాన్ని ఇతరులకు అప్పగించేలా నిర్ణయం తీసుకున్నారనే కారణంతో… ఆయన మీద చర్యలకు సిఫారసు చేశారు. ఆ సిఫారసులను ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఆమోదించి.. మంత్రి అనుమతి కోసం పంపారు. అందుకు ముందు ఓకే చేసిన కొండా సురేఖ…. సదరు ఫైల్‌పై సంతకం చేసినట్టు చెప్పుకుంటున్నారు. కానీ.. ఆ తర్వాత ఓ సహచర మంత్రి నుంచి ఒత్తిళ్లు రావడంతో ఆమె ఆ ఫైల్‌ను వెనక్కి తెప్పించుకున్నారట. రెండోసారి ఫైల్‌తన వద్దకు వచ్చినప్పుడు సదరు అధికారికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వొద్దని నోట్ రాసినట్టు ప్రచారం జరుగుతోంది.

Read Also: Eng vs IND: డబుల్ సెంచరీతో చెలరేగిన కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్.. భారీ స్కోర్ సాధించిన భారత్..!

కానీ, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా.. ఆ ఫైల్‌ను సీఎస్‌ ఆమోదం కోసం పంపారని సమాచారం. బిజినెస్ రూల్స్ ప్రకారం ఒక అంశంపై మంత్రి, సెక్రెటరీ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు.. సీఎస్ నిర్ణయానికి పంపడంలో తప్పేమీ లేదని సదరు సీనియర్ ఐఏఎస్ వాదిస్తున్నట్టు తెలిసింది. దీంతో… మంత్రి సురేఖ సదరు ఉన్నతాధికారి మీద నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తన శాఖకు ఆయన ముఖ్య కార్యదర్శిగా వచ్చినప్పటి నుంచి ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మూడు పేజీల్లో వివరించినట్లు సమాచారం. తను తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకుండా కొర్రీలు పెట్టడం, ఫైల్స్‌పై చర్చించేందుకు రావాలని పదే పదే ఫోన్ చేసినా.. స్పందించట్లేదని ఫిర్యాదులో పేర్కొనట్లు తెలుస్తోంది. ఆ శాఖ పరిధిలోని ఓ సంస్థలో బీఆర్ఎస్ మద్దతుదారులైన కాంట్రాక్ట్‌ ఉద్యోగులు చాలామంది ఉన్నారని, వాళ్ళని తొలగించాలని పలుసార్లు ఆదేశించినా పట్టించుకోలేదని వివరించినట్లు సమాచారం. తెలంగాణ సచివాలయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌. మొత్తానికి మేటర్‌ సీఎంవోకి చేరడంతో… ఇప్పుడు పెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరికీ సయోధ్య కుదురుస్తారా? లేక ఆ ముఖ్య అధికారిని ఇంకో శాఖకు బదిలీ చేస్తారా ఆసక్తిగా గమనిస్తున్నాయి ఉద్యోగ వర్గాలు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • konda surekha
  • off the record
  • OTR
  • Principal Secretary

తాజావార్తలు

  • Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..

  • Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్‌ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!

  • West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..

  • TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి

  • Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions