Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush Political Entry: నటుడు ధనుష్ రాజకీయ రంగప్రవేశంపై కొంతకాలంగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఆయన అభిమాన సంఘం పేరును ‘ధనుష్ నర్పణి ఇయక్కం’ (ధనుష్ సంక్షేమ ఉద్యమం)గా మార్చడంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖాయమని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రాజకీయంగా వేగంగా అడుగులు వేస్తున్న ధనుష్, వారం క్రితం వరకు ఢిల్లీలో కీలక భేటీలు జరిపిన అనంతరం మరో కీలక సమావేశానికి సిద్ధమయ్యారు. నేడు చెన్నైలోని చోళింగనల్లూరు జేబీఆర్ కళాశాలలో ధనుష్‌తో మహిళా అభిమాన సంఘ ప్రతినిధుల భేటీ ఏర్పాటు చేశారు. ధనుష్ అభిమాన సంఘానికి చెందిన 58 జిల్లాల నుంచి తరలివచ్చిన 2,500 మందికి పైగా మహిళా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 3,000 మందికి పైగా మహిళా అభిమానులతో ధనుష్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మహిళా అభిమానులతో ఫొటోలు దిగడంతో పాటు ముఖాముఖి సంభాషణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ధనుష్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు తీవ్రంగా కోరుకుంటున్నారు. 2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ధనుష్ నిలవాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
మరోవైపు ధనుష్ పొటిటికల్ ఎంట్రీపై తమిళనాడులో అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) స్పందించింది. ధనుష్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే స్వాగతిస్తామని తెలిపింది. టీవీకే అధికార ప్రతినిధి ఎం. సత్యకుమార్ ఈ అంశంపై మాట్లాడుతూ.. “మా పార్టీ ప్రయాణం ఇతరులు రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తిగా నిలవడం సంతోషం. హీరోగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే విజయ్ సినిమాలను వదిలి రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. విజయ్ ఇందుకోసం 30 ఏళ్లపాటు కృషి చేశారు. ఇది అంత సులభమైన ప్రయాణం కాదు. రాజకీయ పార్టీని స్థాపించడం ఒక ఎత్తయితే.. దానిని నిలబెట్టడం, ఎన్నికల్లో విజయం సాధించడం మరో ఎత్తు. రాజకీయాల్లోకి రావాలనుకునేవారు పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది.” అని వివరించారు.
Also Read
- Tilak Varma: "ఇది కదా తెలుగోడి పవర్".. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
- Tilak Varma: డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ గంభీర్ మాటలు గుర్తు చేసుకుని తిలక్ వర్మ భావోద్వేగం..
- Ashwin: ‘నీటిలోంచి బయటపడ్డ చేపలా లబోదిబో’.. వైభవ్ ఆటపై సీనియర్ ప్లేయర్ ఘాటు విమర్శలు..
- Naman Dhir: విధ్వంసకర ఇన్నింగ్స్‌తో.. టీం మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారిన నమన్ ధీర్.. ఎందుకంటే..
తాజావార్తలు
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
-
Wings Over Ganga Air Show: వారణాసిలో ‘వింగ్స్ ఓవర్ గంగా’ ఎయిర్ షో.. వైమానిక ప్రదర్శనను వీక్షించనున్న ప్రధాని మోడీ
-
Tilak Varma: డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ గంభీర్ మాటలు గుర్తు చేసుకుని తిలక్ వర్మ భావోద్వేగం..
-
Chery Grow C3: పెట్రోల్ + బ్యాటరీతో Chery కొత్త బైక్.. ప్రపంచంలోనే తొలి AI ఇంటెలిజెంట్ క్రూయిజర్‌గా Grow C3!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!