Off The Record: ఆ కలెక్టర్ కాంట్రావర్సీకి కేరాఫ్ అడ్రస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ కలెక్టర్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్సా? ఆ మధ్య కేంద్రమంత్రి ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక చర్చల్లోకి వచ్చారు. తాజాగా రైతుల ధర్నాపై స్పందించ లేదనే విమర్శలు ముసురుకుంటున్నాయి. ఆ కలెక్టర్ తీరు పదే పదే ఎందుకు ప్రశ్నలకు తావిస్తోంది? ఎవరా కలెక్టర్? లెట్స్ వాచ్..!
Also Read
ఏడాదిన్నర క్రితం కామారెడ్డి కలెక్టర్‌గా రాక
జితేష్ పాటిల్. కామారెడ్డి జిల్లా కలెక్టర్. 2016 బ్యాచ్‌కు చెందిన ఈ IAS అధికారి ఏడాదిన్నర క్రితం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కామరెడ్డికి వచ్చే ముందు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. కలెక్టర్‌గా ఆయనకు తొలిపోస్ట్ ఇదే. ప్రస్తుతం కామారెడ్డి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మాస్టర్‌ప్లాన్ సమస్యను సరిగ్గా హ్యాండిల్ చేయలేదని విమర్శలు హోరెత్తుతున్నాయి. రైతులు ఏడు గంటలపాటు ధర్నా చేస్తే.. వాళ్లను కూల్ చేయాల్సింది పోయి.. కూర్చున్న కుర్చీలోంచి కదల లేదని.. ఆయన వైఖరే అగ్నికి ఆజ్యంపోసినట్టు అయ్యిందని కొందరి వాదన.
డ్రాఫ్ట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం..!
జిల్లా కేంద్రంగా ఉన్న కామారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మాస్టర్‌ప్లాన్ తెరపైకి వచ్చింది. అయితే ఆ మాస్టర్ ప్లాన్ ముసాయిదా డ్రాఫ్ట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో కలెక్టర్ ఫెయిల్ అయ్యారనే అభిప్రాయం అధికారపార్టీ వర్గాల్లో ఉంది. ఆ ఉదాసీనతే గోటితో పోయే సమస్యను గొడ్డలి వరకు తీసుకొచ్చారని బీఆర్‌ఎస్ నేతలు గుర్రుగా ఉన్నారట. రైతులు కామారెడ్డి బంద్‌కు పిలుపు ఇవ్వడంతో కలెక్టర్ తీరు ప్రస్తుతం చర్చగా మారింది. అనుభవ రాహిత్యమే సమస్యకు కారణం అనేవాళ్లూ ఉన్నారు. కీలక నిర్ణయాల్లో రాజకీయ వర్గాలను కలుపుకొని వెళ్లాలి. ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేయడం కూడా కీలకమే. ఈ రెండు అంశాల్లో కలెక్టర్ వ్యవహరించిన తీరే ప్రస్తుతం ప్రశ్నగా మారింది.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నలకు తడబాటు
గతంలో జిల్లాలో కేంద్ర ఆర్థికమంతి నిర్మలా సీతారామన్ పర్యటనలోనూ కలెక్టర్ జితేష్ పాటిల్ చర్చల్లోకి వచ్చారు. పీడీఎస్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత అని కేంద్రమంత్రి ప్రశ్నించడం.. ఆయన చెప్పలేకపోవడంతో అదో ఇష్యూ అయ్యింది. ఆ సందర్భంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఇప్పుడు రైతుల ఆందోళనలతో కలెక్టర్ మళ్లీ చర్చల్లోకి వచ్చారు. ఇప్పటికే ఈ సమస్యపై ప్రభుత్వ పెద్దలు.. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మస్టర్ ప్లాన్ ముసాయిదా కేవలం డ్రాఫ్ట్ దశలోనే ఉందని ప్రజలకు, రైతులకు ఎందుకు నచ్చచెప్పలేదని ప్రశ్నించారు. మరి ఈ రెండు ఘటనల తర్వాత కలెక్టర్ తన తీరును మార్చుకుంటారో లేక ఎస్ నేనింతే అని అలాగే ఉండిపోతారో చూడాలి.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!