Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Congress Raises Aggression In Joint Khammam District

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దూకుడు పెంచిన కాంగ్రెస్ !

Published Date :September 18, 2021 , 3:38 pm
By Lakshmi Narayana
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దూకుడు పెంచిన కాంగ్రెస్ !
  • Follow Us :
  • google news
  • dailyhunt

టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై పీసీసీతోపాటు కేడర్‌ కూడా క్షేత్రస్థాయిలో గురి పెట్టిందా? అందుకే సడెన్‌గా ఎమ్మెల్యేల క్యాంప్‌ కార్యాలయాలకు భద్రత పెంచారా? కేసులు పెడుతున్నా.. కాంగ్రెస్‌ కేడర్‌ ఎందుకు దూకుడుగా వెళ్తోంది? ఈ వైఖరి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు వర్కవుట్‌ అవుతుందా?

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ కేడర్‌ గురి..!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కసారిగా కాంగ్రెస్‌ గేర్‌ మార్చి దూకుడు పెంచింది. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గెలవగా.. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకుని టీడీపీ రెండుచోట్ల.. మరో నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోవడంతో.. హస్తంగుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు అధికారానికి దూరంగా ఉండలేకపోయారు. శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, హరిప్రియా నాయక్‌, కందాల ఉపేందర్‌రెడ్డి గులాబీ గూటికి వెళ్లిపోయారు. టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావులది అదే పరిస్థితి. ఇంక ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే సంగతి సరేసరి. భట్టి విక్రమార్క, పొదెం వీరయ్యలు మాత్రమే కాంగ్రెస్‌ శాసనసభ్యులుగా కొనసాగుతున్నారు. వీరిలో భట్టి సీఎల్పీ నేత. జంప్‌ జిలానీలపై 2018 నుంచి చర్చ జరుగుతున్నా.. ఇటీవల పీసీసీకి కొత్త కమిటీ వచ్చాక రచ్చ మొదలైంది. కేడర్‌ కూడా వారిపై గురిపెట్టింది. ఈ సందర్భంగా జరుగుతున్న పరిణామాలే ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.

ఎమ్మెల్యేల క్యాంప్‌ ఆఫీస్‌లపై కాంగ్రెస్‌ జెండాలు

దళిత గిరిజన దండోరా కార్యక్రమాల్లో భాగంగా ప్రదర్శనలు.. ర్యాలీలు నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ కేడర్‌.. ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావుల క్యాంప్‌ కార్యాలయాలపై పార్టీ జెండాలు ఎగరేసింది. కాంగ్రెస్‌ జెండాలు ఎగరేసిన వారిపై పోలీసులు కేసులు పెట్టినా కేడర్‌ వెనక్కి తగ్గడం లేదట. రోజుకోచోట ఉద్యమాలకు ప్లాన్‌ వేస్తున్నారట. దీంతో టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియా నాయక్‌, కందాల ఉపేందర్‌రెడ్డి క్యాంప్‌ ఆఫీస్‌ దగ్గర భద్రత పెంచారు. క్యాంప్‌ ఆఫీసుల దిశగా కాంగ్రెస్‌ శ్రేణులు రాకుండా కాపు కాశారట.

గోడ దూకిన టీడీపీ ఎమ్మెల్యేపైనా కేడర్‌ గుర్రు!

ఒక్క కాంగ్రెస్‌ నుంచి గెలిచిన వారే కాకుండా.. కాంగ్రెస్‌ మద్దతుతో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలను కూడా కేడర్‌ టార్గెట్‌ చేయడం ప్రస్తుతం చర్చగా మారింది. మెచ్చా నాగేశ్వరావు నిన్న మొన్నటి వరకు సైకిల్‌ దిగబోనని ప్రకటించినా.. ఆయన కూడా గులాబీ కండువా కప్పేసుకోవడంతో కాంగ్రెస్‌ కేడర్‌ ఆగ్రహంతో ఉన్నట్టు చెబుతున్నారు. అశ్వరావుపేటలోని టీడీపీ శ్రేణులు కూడా మెచ్చాపై కుతకుతలాడుతున్నట్టు సమాచారం. ఈ నియోజకవర్గాల్లో ఎప్పుడేం జరుగుతుందో.. విపక్ష పార్టీల కేడర్‌ ఎప్పుడెలా రియాక్ట్‌ అవుతుందో తెలియక టెన్షన్‌ పడుతున్నారట.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • khammam
  • off the record
  • telangana

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions