Kaviya Maran: తన ఉద్యోగులకు ఆరెంజ్ ఆర్మీ క్వీన్ సర్ప్రైజ్ గిఫ్ట్.. పెళ్లి కానుక బాక్స్ వీడియోలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaviya Maran: సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ (Sunrisers Hyderabad CEO), సన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్య మారన్ (Kaviya Maran) తన పెళ్లి వేడుకల సందర్భంగా ఉద్యోగులకు ఇచ్చిన ఒక స్పెషల్ గిఫ్ట్‌తో అందరి మనసులు గెలుచుకుంటున్నారు. ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్‌తో (Anirudh Ravichander) ఆమె వివాహ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో, సన్ గ్రూప్ ఉద్యోగులకు (Sun Group employees) పెళ్లి ఆహ్వాన పత్రికలు, చాక్లెట్లతో పాటు ఏకంగా బంగారు ఉంగరాలను (gold rings) కానుకగా పంపించారు ఆరెంజ్ ఆర్మీ క్వీన్.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ గిఫ్ట్ బాక్సులను ఉద్యోగులు తెరిచి చూస్తుండగా.. లోపల వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డులు (wedding invitations), చాక్లెట్లు, గోల్డ్ రింగ్స్ ఉండటం కనిపిస్తోంది. ఎక్స్ వేదికగా (X) వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఉద్యోగి తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడిన మాటలు ఆకట్టుకుంటున్నాయి. తమకు సాధారణంగా గోల్డ్ కాయిన్స్ (gold coins) వస్తాయని ఊహించామని, కానీ బాక్స్ తెరిచి చూశాక బంగారు ఉంగరాలు ఉండటంతో ఎంతో సంతోషంగా, సర్ప్రైజ్గా అనిపించిందని చెప్పుకొచ్చారు. ఆ గిఫ్ట్ బాక్స్‌లో ఉన్న ఆహ్వాన పత్రిక ప్రకారం నవంబర్ 25న ఒక ప్రత్యేక విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ కొత్త జంట వెడ్డింగ్ రిసెప్షన్ నవంబర్ 21న చెన్నైలో జరగనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. నవంబర్ 25న జరిగే ఈ లంచ్ పార్టీ కేవలం సన్ గ్రూప్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేడుకా కాదా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Also Read
- Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
- Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!
- JC vs Kethireddy: తాడిపత్రి ఘర్షణలో ట్విస్టుల మీద ట్విస్టులు.. పెద్దారెడ్డిపై జేసీ సంచలన వ్యాఖ్యలు
- అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!
ఇక అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం (Anirudh Ravichander-Kaviya Maran Wedding) విషయానికొస్తే.. నవంబర్ 11న గ్రీస్‌లో (Greece) అత్యంత సుందరమైన వాతావరణంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఈ జంట తమ పెళ్లి కోసం ఎలాంటి పురోహితులు, సప్తపది వంటి సంప్రదాయ తంతులు లేని ఆత్మగౌరవ వివాహ (Self-Respect Marriage) పద్ధతిని ఎంచుకోవడం విశేషం. ఈ పద్ధతి ప్రకారం బంధువులు, స్నేహితుల సమక్షంలో వధూవరులు ఒకరినొకరు జీవిత భాగస్వాములుగా అంగీకరిస్తున్నట్లు ప్రకటించి, పూలదండలు లేదా ఉంగరాలు మార్చుకుంటే సరిపోతుంది. ఈ వినూత్న వివాహం తర్వాత, నవంబర్ 21న చెన్నైలో (Chennai) ఈ నవదంపతులు గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వబోతున్నారు. ఈ వేడుకకు క్రికెట్ (cricket), సినిమా (cinema), బిజినెస్ (business), రాజకీయ (politics) రంగాలకు చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది.
SRH Owner Kavya Maran presents Gold Ring to all the Sun Group Employees.
Reception on November 25. https://t.co/eA6I4R2U1V
— SportsGully Cricket 🏏 (@sportsgullycric) November 20, 2026
తాజావార్తలు
-
Kaviya Maran: తన ఉద్యోగులకు ఆరెంజ్ ఆర్మీ క్వీన్ సర్ప్రైజ్ గిఫ్ట్.. పెళ్లి కానుక బాక్స్ వీడియోలు వైరల్..
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Devdutt Padikkal: భారత్ కష్టాల్లో పడేది.. మా టార్గెట్ అదే.. పడిక్కల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!
-
JC vs Kethireddy: తాడిపత్రి ఘర్షణలో ట్విస్టుల మీద ట్విస్టులు.. పెద్దారెడ్డిపై జేసీ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!
-
IND vs NZ: ముగిసిన మూడోరోజు ఆట.. 118 పరుగుల ఆధిక్యంలో భారత్.!
-
Royal Enfield బైక్ లవర్స్‌కు క్రేజీ న్యూస్.. 10 ఏళ్ల వారంటీ.. ఎక్స్ట్రా ఖర్చు లేకుండానే..!
-
Hero Splendor+ బైక్ ధరలు పెంపు.. అన్ని వేరియంట్లపై భారీగా పెరిగిన రేట్లు.. కొత్త ధరలు ఇవే!
-
Ball Tampering Scandal: కమిన్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్‌బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!