Site icon NTV Telugu

Off The Record: ఒక్కరి కోసం బీఆర్ఎస్ ఇద్దరు నేతలను దూరం చేసుకుందా..?

Brs

Brs

Off The Record: ఒక్కరు.. ఒక్క లీడర్‌ కోసం బీఆర్‌ఎస్‌ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల్ని దూరం చేసుకుందా? ఒకప్పుడు పార్టీని, అధినేత కుటుంబాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నేతను చేర్చుకోవడం కారణంగానే.. ఇప్పుడు రెండు గులాబీ రేకులు రాలిపోయాయా? ముందు వెనుకా చూసుకోకుండా కొత్త వాళ్లను పార్టీలోకి చేర్చుకుంటే ఎలా ఉంటుందో గులాబీ అధిష్టానానికి ఇప్పుడు తెలిసి వస్తోందా? ఎవరా నాయకుడు? ఆయన రాకకు, వేర్వేరు నియోజకవర్గాల్లో ఇద్దరు వెళ్ళిపోవడానికి సంబంధం ఏంటి?

Read Also: HDFC APK File Scam: ఏపీకే ఫైల్స్‌తో స్కామ్‌.. హెచ్‌డీఎఫ్‌సీ సీరియస్ వార్నింగ్!

బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేసిన ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తన నియోజకవర్గంతో పాటు… ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో… అప్పట్లో స్టేట్‌ మొత్తం తెగ తిరిగేశారాయన. అదే ఊపులో… కేసీఆర్‌, కేటీఆర్‌ టార్గెట్‌గా ఓ రేంజ్‌లో చెలరేగిపోయారు. ఇద్దరి మీద తీవ్ర స్థాయి ఆరోపణలు, విమర్శలు చేశారు ఆర్‌ఎస్‌. అలాగే, సిర్పూర్‌లో అప్పటి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోనేరు కోనప్పను కూడా విమర్శించారాయన. ఆయన్ని అయితే.. వ్యక్తిగతంగా కూడా టార్గెట్‌ చేశారు ఈ మాజీ ఆఫీసర్‌. అయితే…ఆ ఎన్నికల్లో ఇటు ప్రవీణ్‌ గెలవలేదు, అటు కోనప్ప గెలవలేదు. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు సిర్పూర్‌ సీటును బీజేపీ ఎగరేసుకుపోయింది. బీఎస్‌పీ అభ్యర్థిగా తలపడ్డ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ 44వేల 646 ఓట్లు సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఆ ఓటమితో పాటు.. తర్వాత మారిన రాజకీ పరిణామాలు, తన ప్రాధాన్యతల దృష్ట్యా… 2024 మార్చి 16న బహుజన్‌ సమాజ్‌ పార్టీకి రాజీనామా చేశారు ఆర్.ఎస్. తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. కారెక్కేశారాయన. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ప్రవీణ్‌కు నాగర్‌కర్నూల్‌ ఎంపీ టికెట్‌ ఇచ్చింది బీఆర్‌ఎస్‌. ఇక అక్కడి నుంచి తేడాలు మొదలయ్యాయని చెబుతారు రాజకీయ పరిశీలకులు. ప్రవీణ్‌కుమార్‌ను పార్టీలోకి తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు.

Read Also: Israel Gaza War: ఇజ్రాయె‌ల్‌‌ బాస్ కొత్త ప్లాన్.. అంగీకరించకపోతే రాజీనామే గతి..!

సిర్పూర్‌లో తనకంటూ గట్టి వర్గం ఉండి.. అక్కడ పార్టీకి పెద్ద దిక్కుగా చెప్పుకునే కోనప్ప.. ప్రవీణ్‌ను బీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయారట. అందుకే.. ఎంపీ ఎన్నికల కంటే ముందే కారు దిగేసి హస్తం పార్టీలోకి వెళ్ళిపోయారు. అయితే, అక్కడే ఆయన చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కాంగ్రె స్ పార్టీలో ఉన్నప్పటికీ ఆర్.ఎస్‌. ప్రవీణ్ కుమార్ మీద వ్యాఖ్యలు చేశారు తప్ప… కేసీఆర్‌ని ఎక్కడా తప్పు పట్టలేదు. పైగా… తనకు ఆయన దేవుడంటూ ప్రశంసిస్తూ వస్తున్నారు కోనప్ప. అలా.. బీఆర్‌ఎస్‌లోకి ప్రవీణ్‌కుమార్‌ ఎంట్రీతో… సిర్పూర్‌ నియోజకవర్గంలో రేగిన చిచ్చు తాజాగా అచ్చంపేటకు పాకింది. అది కూడా పార్టీని ఒక రేంజ్‌లో కుదిపేస్తున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి ఓడిపోయిన అప్పటి సిట్టింగ్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు … ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎలక్షన్స్‌ మీద కన్నేశారట. నాగర్ కర్నూల్‌ ఎంపీ సీట్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్దిగా పోటీచేయాలన్నది ఆయన ప్లాన్‌. కానీ… అప్పటికే అదే సీటు హామీతో ఆర్‌.ఎస్‌. ప్రవీణ్ కుమార్‌ను పార్టీలో చేర్చుకున్న కేసీఆర్‌.. ఆ మేరకు టిక్కెట్‌ ఇచ్చారు.

Read Also: Sattamum Needhiyum: ‘సట్టముం నీతియుం’ సిరీస్‌కి సూపర్ రెస్పాన్స్

దీంతో డీప్‌గా హర్ట్‌ అయ్యారట గువ్వల బాలరాజు. ఆ ఎన్నికల నుంచే అలిగి కూర్చుని…ఇప్పుడు అదను చూసి బీఆర్‌ఎస్‌కు ఝలక్‌ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. తనకు టికెట్‌ ఇవ్వకపోవడమే కాకుండా, జిల్లా అధ్యక్షుడిగా తాను ఉన్నప్పటికీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పెత్తనాన్ని, పార్టీలో కేసీఆర్‌, కేటీఆర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఇస్తున్న ప్రాధాన్యతను జీర్ణించుకోలేకపోయారట గువ్వల. దీంతో తాజాగా గులాబీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు ప్రటించారాయన. తనకు కాంగ్రెస్‌ నుంచి కూడా ఆఫర్‌ ఉందంటున్నారు మాజీ ఎమ్మెల్యే. మొత్తం మీద… పార్టీలోకి ఒక్క ప్రవీణ్‌కుమార్‌ను తీసుకున్న బీఆర్‌ఎస్‌ రెండు చోట్ల ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను దూరం చేసుకుందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు. మరోవైపు అసెంబ్లీ ఎన్నిలకు ముందు ప్రవీణ్‌కుమార్‌ బీఎస్పీ అధ్యక్షుడి హోదాలో… అప్పటి సీఎం కేసీఆర్‌ కుటుంబాన్ని దూషించిన వీడియోలు ఇప్పటికీ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి. అప్పట్లో ఆ స్థాయిలో తిట్టిన వ్యక్తి కోసం ఇప్పుడు బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఈ స్థాయి త్యాగాలు చేయడం మామూలు విషయం కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Exit mobile version