తాజాగా తొమ్మిది నెలలు మోసి కనిపెంచిన కన్న తల్లిని ఓ తాగుబోతు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని పొట్టుపొట్టుకొట్టాడు. మద్యానికి డబ్బు ఇవ్వలేదని కన్న తల్లినే నడి రోడ్డుపై జుట్టు పట్టి లాగి ఓ యువకుడు పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులో ఇవాళ (బుధవారం) జరిగింది. అయితే.. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన పద్మమ్మ భర్త కోల్పోయి ఓ హోటల్ లో పని చేస్తూ జీవనం కొనసాగిస్తుంది.