తెలంగాణలో సెప్టెంబర్ 17 హీట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సెప్టెంబర్ 17 హీట్ మొదలైంది. అదేరోజు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భారీ సభలకు రెడీ అవుతున్నాయి. విమోచన దినం పేరుతో కమలనాథులు.. ఆత్మగౌరవ సభ పేరుతో గజ్వేల్‌లో కాంగ్రెస్ ఫోకస్పెట్టాయి. మరి.. టీఆర్ఎస్ ఆలోచన ఏంటి? అధికారపార్టీ ఏం చేయబోతోంది?
తెలంగాణలో సెప్టెంబర్ 17 వేడి!
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్న సభ్యత్వ నమోదు వ్యవహారం
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 వస్తుంది అంటే తెలంగాణలో పొలిటికల్‌గా హాట్ హాట్ చర్చ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 17 పై రాజకీయ పార్టీలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. నిజాం పరిపాలనలో ఉన్న భూభాగం భారత్‌లో కలిసిన రోజు కావడంతో ప్రాధాన్యం ఏర్పడింది. కొందరు విలీనం అంటే.. మరికొందరు విమోచనం.. ఇంకొందరు విద్రోహదినం పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దీనిపై పెద్ద చర్చ జరిగేది. తెలంగాణ ఏర్పడి నప్పటి నుంచి ఆ వేడి ఇంకా రాజుకుంది.
నిర్మల్‌లో అమిత్ షాతో బీజేపీ భారీ కార్యక్రమం!
సెప్టెంబర్ 17 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నది బీజేపీ డిమాండ్. సంగ్రామ యాత్రలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. సెప్టెంబర్ 17న నిర్మల్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఆహ్వానించారు కమలనాథులు. దీంతో నిర్మల్ సభకు ఒక్కసారిగా రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.
సెప్టెంబర్ 17నే గజ్వేల్‌లో కాంగ్రెస్ భారీ సభ!
ఇక ఇదే రోజున గజ్వేల్‌లో ఆత్మగౌరవ సభ నిర్వహించే పనిలో ఉంది తెలంగాణ కాంగ్రెస్. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో గజ్వేల్ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు రేవంత్ అండ్ బ్యాచ్. సెప్టెంబర్ 17న విలీన దినంగా పరిగణిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. బీజేపీ ఇదే రోజున నిర్మల్‌లో సభ పెడుతుండటంతో.. పోటీగా గజ్వేల్ సభను కాంగ్రెస్ ఎంచుకుందన్నది రాజకీయ వర్గాల అనుమానం. అయితే విలీనం.. విమోచనం అని కాకుండా గజ్వేల్ కార్యక్రమానికి దళిత గిరిజన ఆత్మగౌరవ సభ అని పేరు ప్రకటించింది. ఇదే పేరుతో ఇప్పటికే రాష్ట్రంలో పలు సభలు నిర్వహించింది కాంగ్రెస్. అందుకే ఒకేరోజు జరిగే రెండు పార్టీలు కార్యక్రమాలపై చర్చ మొదలైంది.
టీఆర్ఎస్ ఆఫీస్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ!
సెప్టెంబర్ 17 విషయంలో అధికారపార్టీ టీఆర్ఎస్ ఆలోచన వేరు. పార్టీల మధ్యే భిన్నమైన వాదనలు ఉన్నాయని గులాబీ నేతలు గతంలో అనేకసార్లు స్పష్టం చేశారు. ఆ రోజున టీఆర్ఎస్ కార్యాలయాల్లో జెండా జెండాను ఆవిష్కరించి అంతటితో సరిపెడుతోంది. ఈ ఏడాది బీజేపీ, కాంగ్రెస్ కార్యక్రమాలు ఎలా ఉన్నా.. తమ వైఖరి మాత్రం మారబోదన్నది టీఆర్ఎస్ వర్గాల మాట. విపక్షపార్టీలు ఎంత హడావిడి చేసినా గులాబీ శిబిరం తొణకడం లేదు. టీఆర్ఎస్కు ఒక విధానం ఉందని దానినే ఫాలో అవుతామన్నది వారి వాదన. బీజేపీ, కాంగ్రెస్‌లు మాత్రం… రాష్ట్రంలో బలమైన పార్టీలుగా అవతరించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఇప్పుడు సెప్టెంబర్ 17ను కూడా ఆ కోణంలోనే చూస్తున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. మరి.. 17 తర్వాత ఆ ప్రభావం ఎవరికి కలిసి వస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
-
Rohit Sharma: “నన్ను క్షమించు..” మహిళా అభిమానికి ‘హిట్ మ్యాన్’ స్పెషల్ రిక్వెస్ట్..!
-
Supreme Court: చిన్నారుల మిస్సింగ్‌లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Film Chamber: ఆ కలరింగ్ అంతా అబద్ధం.. ‘పెద్ది’ పర్సెంటేజ్ డీల్‌ను తిరస్కరించిన ఎగ్జిబిటర్లు
-
Virat Kohli: స్టాండ్స్‌లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!