Site icon NTV Telugu

Off The Record: అయ్యన్న నోటితో టీడీపీ ఇబ్బంది పడుతోందా ?.. తాజా వ్యాఖ్యలు టీడీపీకే ట్రిగ్గర్ అయ్యాయా?

Ayyana

Ayyana

Off The Record: ఆ సీనియర్ నేత ప్రతిపక్షాన్ని చీల్చి చెండాడేస్తుంటే.. ‘మా సార్ సూపర్’ అని అధికార పార్టీ తెగ సంబరపడింది. కానీ, ఈసారి అదే సార్‌ నోటి నుంచి వచ్చిన పెగ్గు పురాణం దెబ్బకు కిక్కు మరీ ఎక్కువైపోయి.. భూమి తల్లకిందులుగా తిరుగుతున్నట్టు కనిపిస్తోందట టీడీపీ లీడర్స్‌కు. ఓవైపు ప్రభుత్వ పెద్దలు లక్షల కోట్ల వ్యాపార ఒప్పందాల్లో బిజీగా ఉంటే… బీర్లు,బికినీలు అంటూ అటెన్షన్ డైవర్ట్‌ చేసిన ఆ లీడర్‌ ఎవరు? ఎందుకా రచ్చ?

Read Also: Off The Record: జనసేనకు వెన్నుపోట్లు?.. పవన్‌ కళ్యాణ్ స్పెషల్‌ క్లాస్‌ పీకారా?

మైండ్‌లో ఏది అనిపిస్తే… పైకి బ్లైండ్‌గా అనేసే కొద్ది మంది రాజకీయ నాయకుల్లో ఒకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు. తేడా వస్తే పార్టీ అధినేత అయినా డోంట్ కేర్ అనే నైజం ఈ టీడీపీ లీడర్‌ది. బహుశా ఆయన దూకుడుని తట్టుకోవడం కష్టమని భావించిందో.. లేక సీనియారిటీకి గౌరవం ఇవ్వాలనుకుందోగానీ… ఈసారి అయ్యన్నను స్పీకర్ పోస్ట్‌లో కూర్చోబెట్టింది టీడీపీ అధిష్టానం. ఆయన్ని ఇక లాక్‌ చేశామని పార్టీ పెద్దలు భావించినా.. అయ్యన్న పాత్రుడి నోరు మాత్రం ఆగడం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఫక్తు రాజకీయ నాయకుడిలాగే మాట్లాడుతూ… తాను వాటికి అతీతమైన పోస్ట్‌లో ఉన్నానన్న సంగతి మర్చిపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. స్పీకర్‌ అయ్యాక, అంతకు ముందు కూడా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ ఎమ్మెల్యేలను ఓ ఆ ట ఆడేస్తున్న అయ్యన్న….ఇప్పుడిక తన గన్‌ని స్వపక్షం మీదికే ఎక్కుపెట్టారా అన్న డౌట్స్‌ వస్తున్నాయి. కావాలని అనకున్నా… ఆయన ఉద్దేశ్యం ఏదైనా…అయ్యన్న మాటలు మాత్రం ప్రభుత్వాన్ని తీవ్రంగానే ఇరుకున పెడుతున్నట్టు విశ్లేషిస్తున్నారు.

Read Also: Top Budget Movies : ఇండియాలో టాప్-3 హై బడ్జెట్ సినిమాలు ఇవే

మరీ ముఖ్యంగా ఇటీవల ఆయన చెప్పిన పెగ్గు పురాణం మాత్రం చర్చనీయాంశం అయ్యాయి. విశాఖ వేదికగా మూడు రోజుల పాటు సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. ఈ సదస్సులో మొత్తం 13.25లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నామని ప్రకటించుకుంది. కానీ… ఇదంతా ప్రచార ఆర్భాటమేనని, చిత్తశుద్ధి లేని శివపూజ చేసి ప్రజలను మాయచేస్తోందని విపక్షం వైసీపీ ఎదురుదాడి చేసింది. 2014-19మధ్య ఒప్పందాల పేరుతో బిల్డప్ ఇచ్చి వేల కోట్లు ఖర్చు పెడితే కేవలం 2 శాతం పెట్టుబడులు మాత్రమే రాష్ట్రానికి వచ్చింది నిజం కాదా అని ప్రశ్నిస్తోంది వైసీపీ. సమ్మిట్‌ నిర్వహణ, పెట్టుబడులకు సంబంధించి ఈ మాటలు నడుస్తుండగానే…వాటన్నిటినీ డామినేట్‌ చేస్తూ…అందరి దృష్టి అయ్యన్న మాటల మీదికి పోవడం వాటి చుట్టూనే చర్చలు ఎక్కువగా జరగడం టీడీపీ అధిష్టానానికి కూడా మింగుడు పడటంలేదట.

Read Also: Off The Record: తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. ఇప్పటి నుంచే బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని సిద్ధం చేస్తోందా?

అసలీ పెద్దాయన తెలిసి మాట్లాడుతున్నాడా? తెలియక మాట్లాడుతున్నాడా? నోటికి ఏది వస్తే అది మాట్లాడు మొత్తం తేడా చేసేస్తున్నారంటూ టీడీపీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయట. ఓవైపు సీఐఐ సమ్మిట్ జరుగుతుండగానే…విశాఖ వేదికగా ప్రాపర్టీ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ అయ్యన్న….మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలోనే తనదైన శైలిలో సెటైర్లు వేశారు. విశాఖ అభివ్రుద్ధికి, పెట్టుబడులు రావడానికి అనుకూల వాతావరణాన్ని సృష్టించడం అవసరం అంటూనే పర్యాటకంపై ఫోకస్ పెరగాలని సూచించారాయన. అంతటితో ఆగితే… బాగానే ఉండేది. అలా ఆగితే ఆయన అయ్యన్న ఎలా అవుతారు? గోవా తరహాలో విశాఖలో కూడా ఫ్రీజోన్ అందుబాటులోకి వచ్చినప్పుడే టూరిజం ఆశించిన స్ధా యిలో ఊపందుకుంటుందన్నారాయన. సరే, అదీకూడా ఓకే అనుకుందాం.. ఫ్రీ జోన్‌ అన్న మాటతో వదలకుండా దాన్ని పూర్తిగా విడమర్చి చెబుతూ ఇచ్చిన ఉదాహరణలే ఇంత రచ్చకు కారణం అవుతున్నాయి.

Read Also: Off The Record: కవిత విషయంలో ఇక దూకుడు పెరుగుతుందా ?.. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని డిసైడయ్యారా ?

సముద్రాన్ని చూస్తూ టీ తాగిపోవడం కోసం విశాఖకు పర్యాటకులు రారని.. భర్త రెండు పెగ్గులు వేస్తుంటే పక్కన కూర్చుని భార్య ఐస్ క్రీం తినేలాంటి ఎకో సిస్టం డెవలప్‌ అవ్వాలన్నది ఈ పెద్దాయన అభిప్రాయం అట. సందర్భం అవునో కాదో అంటూనే అయ్యన్న లేవనెత్తిన ఈ పెగ్గు పురాణం మహిళా సంఘాలకు మంటెక్కిపోయేలా చేసింది. తక్షణమే స్పీకర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు, వైసీపీ సైతం గట్టిగానే తగులుకుంది. బీర్లు, బికినీల గురించి మాట్లాడ్డానికేనా మీ పెద్దరికం అంతా అని ఎదురు దాడి చేస్తోంది. ఇక్కడ మహిళా సంఘాలు, వైసీపీ విమర్శల కంటే ఎక్కువ తలకొట్టేసుకుంటోంది స్వపక్షమేనట. సమ్మిట్‌ మొదటి రోజు అందరి ద్రుష్టీ పెట్టుబడుల సదస్సు మీద వుంటే అయ్యన్న చేసిన హాట్ కామెంట్స్ మొత్తాన్ని డైవర్ట్ చేసి పాడేశాయని చర్చ బాధపడ్డారట టీడీపీ పెద్దలు.

Read Also: AP Govt: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అంతర్జిల్లా బదిలీలపై ఏపీ సర్కార్ ఉత్తర్వులు..

వాస్తవానికి అయ్యన్న ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ టూరిజం కాన్ క్లేవ్ లో వైజాగ్ బీచ్‌కు గోవా తరహాలో అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదించి తీవ్రమైన చర్చకు కారణం అయ్యారు. అప్పుడు సందర్భం వేరు. కేవలం వాటిని అయ్యన్న వ్యక్తిగత వ్యాఖ్యలుగా చూశారు….కానీ, సీఐఐ సమ్మిట్ మొదటి రోజు ఇష్యూ డిఫరెంట్ గా ప్రొజెక్ట్ అవ్వడం చర్చకు కారణం అయ్యిందట. దీని వెనుక ఉద్దేశాలు ఏవైనా….అయ్యన్నతో అంత ఈజీ కాదని మరోసారి టీడీపీ పెద్దలకు అవగతం అయిందనే చర్చ మాత్రం నడుస్తోంది. ఇదంతా చూస్తున్న వారు మాత్రం అతడు సినిమాలో నాజర్‌ని ఉద్దేశించి బ్రహ్మానందం అన్న డైలాగ్‌ని గుర్తుకు తెచ్చుకుంచున్నారట.

Exit mobile version