Top Budget Movies : ఇండియన్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం భారీ బడ్జెట్లతో రూపొందుతున్న మూడు మెగా ప్రాజెక్టులు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ మూడు సినిమాలు బడ్జెట్ పరంగా మాత్రమే కాదు, వాటి నటీనటులు, దర్శకులు, కథలు కూడా టాప్ రేంజ్ లో ఉన్నాయి. అందులో ఫస్ట్ రామాయణ ఉంది. దీని బడ్జెట్4,000 కోట్లు. భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ఇది. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణ భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్-వరల్డ్ మూవీగా నిలుస్తోంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా కనిపిస్తున్నారు. ఈ సినిమా మూడు భాగాలుగా తెరకెక్కుతోంది.
Read Also : Premante Movie : ఆసక్తికరంగా ప్రియదర్శి ప్రేమంటే ట్రైలర్..
రెండోది వారణాసి. రాజమౌళి రూపొందిస్తున్న కొత్త మాస్టర్‌పీస్ ఇది. ఎప్పుడూ కొత్తదనం, భారీ స్కేల్‌కు పెట్టింది పేరు అయిన దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను 1,100 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఇది ఇండియాలో రెండో అత్యంత భారీ బడ్జెట్ మూవీగా వస్తోంది. మహేశ్ బాబు ప్రధాన పాత్రలో చేస్తుండగా ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. అడ్వెంచర్ జానర్ లో వస్తోంది. మూడోది అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో వస్తున్న సినిమా. దీని బడ్జెట్ 800 కోట్లు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ హైప్ ఉంది. యాక్షన్, ఎమోషన్ కలిపిన పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఇది తెరకెక్కుతోంది.
Read Also : Mythri Movie Makers : ప్రశాంత్ నీల్-మైత్రీ మూవీస్ కాంబోలో కొత్త మూవీ స్టార్ట్