మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభరా అనే సినిమా తెరకెక్కుతోంది. బింబిసారా అనే సినిమా డైరెక్టర్ చేసిన వశిష్ట ఈ సినిమా డైరెక్ట్ చేశాడు. నిజానికి ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ గేమ్ చేంజర్ చిత్రం కోసం ఈ సినిమాని వాయిదా వేశారు. అయితే అది వాయిదా వేసేందుకు మరో కారణం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే కంప్యూటర్ గ్రాఫిక్స్. ఈ విశ్వంభరా అనేది ఒక సోషియో ఫాంటసీ మూవీ. కాబట్టి సినిమాకి కంప్యూటర్ గ్రాఫిక్స్ కీలకంగా తెలుస్తోంది. ఆ మధ్య దసరా సందర్భంగా విడుదల చేసిన టీజర్ గ్రాఫిక్స్ విషయంలో టీం నెగెటివిటీ ఎదుర్కొంది.
Aadi Pinisetty: ‘వైరం ధనుష్’ను మరిపించే అఖండ!
ఈ నేపథ్యంలో సినిమా మీద చాలా ఫోకస్ పెట్టి టీం పని చేస్తోంది. సినిమా కథపరంగా అయితే బాగుందని విజువల్స్ పరంగా కూడా చాలా కేర్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఎంత ఆలస్యమైనా పర్లేదు మంచి అవుట్ ఫుట్ వచ్చిన తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి కొన్ని పాటలు పెండింగ్ ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవితో వాటి షూటింగ్ కూడా ఈ మధ్య పూర్తి చేశారు. ఇక మరికొంత భాగం షూటింగ్ మిగిలి ఉండడంతో వీలైనంత త్వరగా దాన్ని పూర్తి చేసి పూర్తి కంప్యూటర్ గ్రాఫిక్స్ తో కూడిన బెస్ట్ ప్రోడక్ట్ చేతికి వచ్చాక అప్పుడు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ..