టాలీవుడ్ స్టార్ హీరో ఒకరి గురించి ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అతను తాగుడికి బానిస అయ్యాడు అని అంటున్నారు. విపరీతంగా తాగుతూ ఉండడంతో అనారోగ్యం వెంటాడుతోందని అనునిత్యం ఏదో ఒక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో అతని సన్నిహితులు ఈ విషయం మీద బాధపడుతున్న విషయం ఫిలింనగర్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సదరు హీరో తరచు అనారోగ్యానికి గురి కావడం వల్ల సినిమా షూటింగ్స్ సైతం ఎఫెక్ట్ అవుతున్నాయని తెలుస్తోంది. ముందు వేసుకున్న షెడ్యూల్స్ సైతం అతని అనారోగ్యం కారణంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
Priyanka Gandhi: కుంభమేళాపై విపక్షాలకు మాట్లాడే అవకాశమివ్వాలి
అతని కారణంగా మిగతా టీం మొత్తం డేట్లు మళ్లీ సెట్ చేయాలంటే తలకు మించిన భారంగా నిర్మాతలకు మారుతోందని అంటున్నారు. నిజానికి సినిమా మొదలుపెట్టే ముందే ఏ ఏ రోజు హీరో సహా మిగతా టీం అందుబాటులో ఉంటుందో ఆ రోజే షూటింగ్ సెట్ చేసుకుంటారు. అయితే సదరు హీరో తాగుడు దెబ్బతో అనారోగ్యం పాలవుతూ ఉండడంతో ఆ రోజు కేటాయించిన డేట్ వృథా అవుతోంది. ఈ విషయంపై ప్రస్తుతానికి నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు. త్వరలోనే సదరు హీరోని కూర్చోబెట్టి ఇలా అయితే భవిష్యత్తులో మీతో సినిమాలు చేయడం కష్టమేనని ఖరాకండిగా చెప్పేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో అసలు హీరో వారి మాటలు విని తాగుడికి దూరమై మళ్ళీ సినిమాల మీద దృష్టి పెడతాడా? లేక అదే తాగుడుతో అనారోగ్యం పాలవుతూ ముందుకు వెళతాడా అనేది చూడాల్సి ఉంది.