యంగ్ హీరో శర్వానంద్ విడాకులు తీసుకుంటున్నాడనే వార్తలు ఇప్పటివి కాదు. నిజానికి ఆయన రక్షిత రెడ్డి అని యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత కొన్నాళ్లకు వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోతున్నారు అనే ప్రచారం మొదలైంది. ఆ తర్వాత విడాకులు జరగలేదు. సరి కదా, శర్వానంద్ మరిన్ని సినిమాలు లైన్‌లో పెట్టాడు. ఇప్పుడు తాజాగా మరోసారి వీరి విడాకుల వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ అవుతుంది. పేరు లేకుండా కొందరు, పేరు పెట్టి కొందరు వీరు విడిపోతున్నారని లేదు, ఇంకా విడిపోలేదు కానీ విడిపోయే ఆలోచనలో ఉన్నారని ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వండి వడ్డిస్తున్నారు.
Also Read:Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ గాయాలు.. టీం కీలక ప్రకటన
అయితే అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా, ప్రస్తుతం శర్వానంద్ షూటింగ్ బిజీలో ఉన్నాడని తెలుస్తోంది. వాస్తవానికి వారిద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే కానీ, అది విడాకులు తీసుకునే అంత గ్యాప్ అయితే కాదు. ప్రస్తుతానికి శర్వానంద్ షూటింగ్ హడావుడిలో ఉండడంతో ఇద్దరు వేరువేరు నివాసాలలో ఉంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న 36వ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అభిలాష్ రెడ్డి కంకర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శర్వ మీద రేసింగ్‌కి సంబంధించిన కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, అతుల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. యూవీ వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది.