Peddi: పెద్ది ప్రమోషన్స్ మొదలెట్టేస్తున్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చరణ్ తేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా మీద, ప్రకటించిన నాటి నుంచి అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ పూర్తి కాకపోవడం సహా కొన్ని ఆలస్యాల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాని జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టబోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమా ప్రమోషన్స్ రేపటి నుంచి మొదలుపెట్టబోతున్నారు. రేపు ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన అవినాష్ కొల్లా మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు.
ప్రింట్ సహా ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు యూట్యూబ్ ఛానల్స్ కి కూడా ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు. ఇక ప్రస్తుతానికి బుచ్చిబాబు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఒకసారి ఫైనల్ కాపీ సిద్ధమయ్యాక బుచ్చిబాబు సహా రామ్ చరణ్, జాన్వీ కపూర్ వంటి వాళ్లు కూడా ఈ ప్రమోషన్స్ లో భాగమయ్యే అవకాశం ఉంది. నిజానికి ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో, ఆ మధ్యలోనే సాంగ్ లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే కాస్త గ్యాప్ వచ్చిన సరే, ఇప్పుడు ఫ్రెష్ గా మరోసారి ఇంటర్వ్యూలు ప్రారంభించబోతున్నారు. ఒక రకంగా ఇది ‘పెద్ది’ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కి శుభారంభం అనే చెప్పాలి.
Also Read
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
- Mithali Raj: 'సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..' పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!