Ashok Selvan: ‘కింగ్ 100’లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashok Selvan: అక్కినేని నాగార్జున కెరీర్లో 100వ ల్యాండ్‌మార్క్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం ‘కింగ్ 100’. నాగ్- టబు కాంబినేషన్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సూపర్ హైప్ ఉంది. రీసెంట్గా టబు ‘మహంతి’ ఝాన్సీ రాణి పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచిన టీమ్, ఇప్పుడు మరో అదిరిపోయే అప్డేట్తో ముందుకొచ్చింది. సినిమాలో కింగ్‌ను ఢీకొట్టే బలమైన పాత్రలోకి ఓ వెర్సటైల్ యాక్టర్ ఎంట్రీ ఇచ్చాడు.
తమిళంలో విభిన్నమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న అశోక్ సెల్వన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో తన రోల్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఇందులో ఆయన ‘కర్ణా’ అనే క్యారెక్టర్ చేయబోతున్నారు. అయితే టాక్ ఏంటంటే.. ఈ సినిమాలో అశోక్ సెల్వన్ నెగటివ్ షేడ్స్ ఉన్న కరుడుగట్టిన పోలీస్ ఆఫీసర్‌గా, అంటే నాగార్జునకు ధీటైన మెయిన్ విలన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. వెండితెరపై నాగార్జున వర్సెస్ అశోక్ సెల్వన్ మధ్య సాగే మైండ్ గేమ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట.
Also Read
- Akkineni Nagarjuna: కొత్త హీరోలకు ఆ ఒక్కటే దిక్కు.. నాగార్జున కామెంట్స్ వైరల్!
- Katrina - Vicky Kaushal: దీపావళి సర్ప్రైజ్.. కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా-విక్కీ! పిక్ చూశారా?
- Karthi-Suriya: కార్తీ, సూర్య.. వెయిట్ చేస్తూనే ఉంటారా?, హోప్స్ వదిలేసుకుంటారా?
- Ramayana Movie Piracy: 'రామాయణ: పార్ట్ 1' మూవీ పైరసీ.. ఇక థియేటర్లలో వీడియోలు రికార్డ్ చేస్తే క్రిమినల్ కేసే..!
అన్నపూర్ణ స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, సుస్మితా భట్, విజయేంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో పాటలు, బీజీఎమ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీని 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నాగ్ వందో చిత్రం కావడంతో ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ గంపెడంత ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు పవర్ఫుల్ విలన్ ఎంట్రీతో ‘కింగ్ 100’ రికార్డుల వేట మొదలుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Ashok Selvan: ‘కింగ్ 100’లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
-
Scam: నల్లగొండలో నకిలీ ఉద్యోగ స్కాం.. రిటైర్మెంట్ తర్వాత డెత్ డ్రామా..
-
Akkineni Nagarjuna: కొత్త హీరోలకు ఆ ఒక్కటే దిక్కు.. నాగార్జున కామెంట్స్ వైరల్!
-
Katrina – Vicky Kaushal: దీపావళి సర్ప్రైజ్.. కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా-విక్కీ! పిక్ చూశారా?
-
Seattle Diwali Celebrations: పండుగ వేళ విద్వేషం.. అమెరికాలో దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు యత్నం!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!