Chiru – Bobby : చిరంజీవి – బాబీ సినిమా మాస్ సాంగ్’కి పూనకాలే!

Chiranjeevi, Chiru158, Ss Thaman, Bobby Kolli

Chiranjeevi, Chiru158, Ss Thaman, Bobby Kolli

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. గతంలో ‘వాల్తేరు వీరయ్య’ లాంటి హిట్ తర్వాత బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ నిన్నటి వరకు హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. అక్కడ థమన్ స్వరపరిచిన ఒక మాస్ బీట్ సాంగ్ కోసం మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులు వేసినట్లుగా చెబుతున్నారు.

ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సాంగ్ ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా సాంగ్ అని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కోసం థమన్ స్వరపరిచిన ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా చార్ట్ బస్టర్ అవడం ఖాయం అని తెలుస్తోంది. పొల్లాచిలో కొంతమేర ఈ సాంగ్ షూటింగ్ చేయగా, రెండు రోజుల పాటు హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన స్పెషల్ సెట్ లో కూడా ఈ సాంగ్ షూటింగ్ జరిపారు. ఇక నిన్నటితో ఈ సాంగ్ షూట్ కూడా కంప్లీట్ అయినట్లుగా తెలుస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోంది. ఇప్పటివరకు కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థకి సాలిడ్ హిట్ లేదు, కానీ ఒకపక్క మెగాస్టార్ చిరంజీవితో, మరొక పక్కన నందమూరి బాలకృష్ణతో చేస్తున్న సినిమాలతో కచ్చితంగా కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ టాప్ లీగ్ లోకి దూసుకుపోవడం ఖాయమని అంటున్నారు.