Food Racism: ‘మీ ఆహారం కంపు కొడుతోంది..’ఇండియాపై వివక్ష విషం కక్కిన అహంకార అమెరికా.. చివరకు ఫ్యూజులౌట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక చిన్న ఘటన.. పెద్ద తీర్పు. అమెరికా-కొలరాడో యూనివర్సిటీపై ఇద్దరు భారతీయ విద్యార్థులు న్యాయపరంగా గెలిచారు. క్యాంపస్‌లో భోజనాన్ని వేడి చేసుకున్నందుకు మొదలైన వివక్ష చివరకు కోటి 60లక్షల రూపాయల సెటిల్‌మెంట్‌తో ముగిసింది.
భారతీయ ఆహారాన్ని అవమానించడంతో మొదలైన ఈ ఎపిసోడ్ చివరకు న్యాయస్థానంలో పోరాడి గెలిచింది. ఈ కేసులో గెలుపు డబ్బు గురించి కాదు.. భారతీయతను చిన్నచూపు చూస్తే ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగింది? పశ్చిమ దేశాల్లో భారతీయులు రోజూ ఎదుర్కొంటున్న ఫుడ్ రేసిజానికి ఒక ప్రూఫ్‌గా నిలుస్తోందా? ఈ గెలుపు వెనుక దాగి ఉన్న అసలు స్టోరీ ఏంటి?
2023 సెప్టెంబలో కొలరాడో యూనివర్సిటీ బోల్డర్ క్యాంపస్‌లో పీహెచ్‌డీ చదువుతున్న ఆదిత్య ప్రకాష్ తన భోజనాన్ని మైక్రోవేవ్‌లో వేడి చేసుకున్నాడు. అది పాలక్ పన్నీర్. భారతీయుల ఇళ్లలో సాధారణంగా వండే కూర. కానీ అక్కడే ఉన్న ఒక స్టాఫ్ సభ్యుడు ఆ ఆహారం కంపు కొడుతుందని అభ్యంతరం వ్యక్తం చేశాడు. క్యాంపస్‌లో ఇలా కంపు కొట్టే ఆహారాన్ని వేడి చేయొద్దనే నిబంధన ఉందని చెప్పాడు. నిజానికి ఆ నిబంధన ఎక్కడా రాసి లేదు. ఆ ఘటన అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆదిత్య ప్రకాష్‌తో పాటు అతని ఫ్రెండ్ ఉర్మి భట్టాచార్యపై పరోక్ష ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఇద్దరూ అదే యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. రీసెర్చ్ ఫండింగ్ ఆగిపోయింది. టీచింగ్ అసైన్‌మెంట్లు తీసేశారు. నెలలుగా పనిచేస్తున్న గైడ్లు మారిపోయారు. అకడమిక్ కెరీర్ ఒక్కసారిగా గాలిలో వేలాడుతున్నట్టు మారింది. దీంతో 2025లో ఇద్దరూ కోర్టు మెట్లు ఎక్కారు.
Also Read
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
- Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
- Srikanth Odela: షూటింగ్లో ప్లానింగ్ ఫెయిల్.. అందరినీ టార్చర్ పెట్టా: 'ప్యారడైజ్' ఆలస్యంపై దర్శకుడి షాకింగ్ కామెంట్స్!
ఇది డబ్బుకోసం వేసిన కేసు కాదు. తమకు జరిగినది వ్యక్తిగత అపమానమో, సున్నితమైన అపార్థమో కాదని, ఒక సిస్టమేటిక్ వివక్ష అని కోర్టుకు చెప్పారు. ఫుడ్ మీద మొదలైన ఈ వివక్ష, చివరకు చదువు, జీవితం, గుర్తింపునే లక్ష్యంగా చేసుకున్నదని కోర్టుకు వివరించారు. ఈ కేసు సెప్టెంబర్ 2025లో సెటిల్‌మెంట్‌తో ముగిసింది.
ఇద్దరు విద్యార్థులకు డిగ్రీలు ఇవ్వడానికి యూనివర్సిటీ అంగీకరించింది. దాదాపు కోటి 60 లక్షల రూపాయల సెటిల్‌మెంట్ చెల్లించింది. కానీ అదే సమయంలో భవిష్యత్తులో ఆ యూనివర్సిటీలో చదవకూడదు, పనిచేయకూడదనే నిబంధన కూడా పెట్టింది. ఇటు ఈ కేసు ఇండియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఎందుకంటే ఇది ఒక్క క్యాంపస్ కథ కాదు. పశ్చిమ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు రోజూ ఎదుర్కొనే అనుభవాలకు ఇది ఒక ప్రతిబింబం. వాసన పేరుతో ఆహారాన్ని అవమానించడం, ఆహారంతో పాటు సంస్కృతిని కూడా చిన్నచూపు చూడటం విదేశీయులకు అలవాటుగా మారింది. భారతీయులతో పాటు ఆఫ్రికన్ ప్రజలు ఈ ఫుడ్ రేసిజాన్ని ఏదో ఒక రూపంలో ఎదుర్కొంటూనే ఉన్నారు.
ఇక ఆదిత్య ప్రకాష్, ఉర్మి భట్టాచార్య ఇప్పుడు భారత్‌కు తిరిగొచ్చారు. మళ్లీ అమెరికాకు వెళ్లే ఆలోచన కూడా లేదంటున్నారు. ఎందుకంటే ప్రతిభ ఎంత ఉన్నా, స్కిన్ కలర్, వంట వాసన, జాతీయత ఆధారంగా ఎప్పుడైనా తమని బ్యాన్ చేసే అనిశ్చితి అక్కడ బలంగా ఉన్నట్టు అనిపించిందని చెబుతున్నారు. మరోవైపు ఒక ప్లేట్‌లో ఉన్న ఆహారం ఒక మనిషి గుర్తింపుగా మారితే, ఆ గుర్తింపును అవమానించడం ఎంత పెద్ద నేరమో ఈ కేసు గుర్తు చేస్తోంది.
ALSO READ: చీకటి గుహల్లో నేర సామ్రాజ్యం.. భారతీయులే టార్గెట్!
తాజావార్తలు
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
-
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!