Devara Part 1: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా అనేక అంచనాల నడుమ ఎట్టకేలకు నిన్న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్లు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో పాటు రాజమౌళి సెంటిమెంట్ ఎలా ఉంటుందా? అని ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు సైతం ఆసక్తికరంగా ఎదురు చూశారు. నిజానికి ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచే సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
తర్వాత ప్రమోషనల్ యాక్టివిటీస్ మొదలుపెట్టిన తర్వాత ఏ విషయమైనా ముందు నెగిటివ్గా కనిపించేది. పోస్టర్లు కానివ్వండి పాటలు కానివ్వండి ముందు ఇలా ఉంది ఏంట్రా? అనిపించి తరువాత అవే స్లో పాయిజన్ లాగా పాజిటివ్గా మారడం ముందు నుంచి కనిపిస్తూ వచ్చింది. సినిమా రిజల్ట్ విషయంలో కూడా దాదాపుగా అదే ట్రెండ్ కంటిన్యూ అయింది. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత చాలామందికి సినిమా ఏంట్రా ఇలా ఉంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ సబ్జెక్టులా ఉంది అనే అనుమానాలు కలిగాయి. అసలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా లేదా అని కూడా చాలామంది భావించారు.
టెక్నికల్గా సినిమా ఒక రేంజ్ లో ఉంది. జనానికి కనెక్షన్ లేని లోకం. దానికి తోడు అది కథ కొత్త కథ ఏమీ కాదు. దానికి తోడు సెకండ్ హాఫ్ కి లీడ్ ఇచ్చే క్లిఫ్ హ్యాంగర్ కూడా అంత ఆసక్తికరంగా లేదు అని ముందుగా సినిమా చూసిన వాళ్ళందరూ మాట్లాడారు. అయితే ఆ మాటలన్నీ కేవలం అభిప్రాయాలుగా మారిపోయాయి. ఎందుకంటే మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. రెండవ రోజు బుకింగ్స్ కూడా ఒక రేంజ్ లో కనిపిస్తున్నాయి. ఇక మూడవరోజు ఆదివారం కాబట్టి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
మరొక పక్క సత్యం సుందరం సినిమా కూడా రిలీజ్ అయింది కానీ దేవరతో పోలిస్తే అది చాలా సైలెంట్ సినిమా, లిమిటెడ్ స్క్రీన్స్. వచ్చేవారం సినిమాలు పెద్దగా రిలీజ్ కి లేవు ఒక రకంగా రజినీకాంత్ వేట్టయన్ వచ్చేవరకు పెద్ద సినిమాలు లేవు. కాబట్టి ఆ స్పేస్ కూడా దేవరకు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటివరకు కాస్త నెగిటివ్ మిక్స్డ్ టాక్ కూడా పాజిటివ్గా మారిపోతుంది. ముందు నుంచి దేవర విషయంలో ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉండడంతో ఇక దేవరకి ఢోకా లేదని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఇదే కలెక్షన్స్ ట్రెండు కొనసాగితే 1000 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద విషయమేమీ కాదని అంటున్నారు. సో ఆల్ ది బెస్ట్ దేవరా.