బన్నీ వాసు నిర్మాతగా తండేల్ అనే సినిమా తెరకెక్కుతోంది. నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా ఈ సినిమాని చందు మొండేటి డైరెక్ట్ చేశారు. అయితే సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ గట్టిగా చేస్తుంది సినిమా యూనిట్. ఈ క్రమంలోనే నిర్మాత బన్నీ వాసు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయనకు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. సినిమా సంగతి పక్కన పెడితే అసలు బన్నీ వాసుని గీతా ఆర్ట్స్ సంస్థ దూరం పెడుతోందా అని అడిగితే దానికి ఆయన స్పందించారు. గీత ఆర్ట్స్ తో నా అనుబంధం 25 ఏళ్లది. ఇప్పుడు నేను నా నెక్స్ట్ జనరేషన్ ని కూడా గీతా ఆర్ట్స్ కే అరేంజ్ చేయాలి. అరవింద్ గారి తర్వాత నా జనరేషన్ నడిచింది. ఇప్పుడు నా తర్వాత నెక్స్ట్ జనరేషన్ కి కూడా ఇప్పటినుంచి ట్రైనింగ్ ఇస్తే మరో పదేళ్లకు రెడీ అవుతారు. అసలు గీత ఆర్ట్స్ కి నాకు సంబంధం మాట్లాడుకునే స్టేజ్ కూడా కాదు మాది అని అన్నారు.
Venkatesh : సంక్రాంతికి వస్తున్నాం ఆల్ టైమ్ రికార్డ్
అయితే బన్నీ వాసు పవన్ కళ్యాణ్ తో కూడా ఉంటున్నారు ఇటు అల్లు కాంపౌండ్ లోనే ఉంటున్నారు. ఆ రెండు కుటుంబాల మధ్య దూరం పెరుగుతోంది కదా ఆ ప్రెజర్ బన్నీ వాసు మీద పడుతుంది. ఆయన అటూ ఇటూ కాకుండా నలిగిపోతున్నాడు అని అంటున్నారు. దీనికి మీరేమంటారు అని అడిగితే.. నేను 100% ఆ పరిస్థితులను హ్యాండిల్ చేయగలను. నాకు ఆ ధైర్యం, టాలెంట్ రెండు ఉన్నాయి. ఇవన్నీ నాకు సమయానుకూల పరిస్థితుల్లాగా అనిపిస్తున్నాయి. ఒక హార్డ్ సిట్యుయేషన్ ఉన్నప్పుడు కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. కానీ అవన్నీ ఏమిటంటే మనం కరెక్ట్ గా, ఓపెన్ గా, జెన్యూన్ గా ఉన్నప్పుడు ఒకవేళ ఈ టైంలో ఏమైనా తప్పుగా అర్థం చేసుకున్నా మిస్ అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉన్నా, కూడా లాంగ్ రన్ లో మాత్రం మన స్టెబిలిటీ, నిలబడే విధానమే మనల్ని నిలబెడుతుంది. ఈ టైంలో నేను ఇలా ఉంటే ఎవరో ఏదో అనుకుంటారు అని నేను నా క్యారెక్టర్ ని, నా స్టాండ్ ని మార్చుకోను. నేను నా ఫ్లోలో వెళ్తాను దాని వెనకాల అన్నీ సెట్ అయి వస్తాయి అనేది నా నమ్మకం.