High Court: వేతన బకాయిలు చెల్లించాలని హైకోర్టులో జడ్పీటీసీలు పిటిషన్ దాఖలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ జడ్పీటీసీలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కడప జిల్లాకు చెందిన 27 మంది జడ్పీటీసీ సభ్యులు తమకు చెల్లించాల్సిన గౌరవ వేతనం, టీఏ, డీఏ బకాయిలను వెంటనే చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ముత్యాల చెన్నయ్య సహా 27 మంది జడ్పీటీసీలు కలిసి దాఖలు చేశారు. పిటిషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. గత 35 నెలలుగా ఒక్కో సభ్యుడికి సుమారు రూ.2 లక్షల 10 వేల వరకు బకాయిలు ఉన్నాయని, వాటిని చెల్లించాలంటూ గత ఆగస్టులో ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని పిటిషనర్లు తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సహా ఇతర ప్రజాప్రతినిధులకు మాత్రం సకాలంలో వేతనాలు చెల్లిస్తున్న ప్రభుత్వం, జడ్పీటీసీల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీటీసీల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ఇది రాజ్యాంగంలోని అధికరణ 14, 21లకు విరుద్ధమని పిటిషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. తక్షణమే తమ వేతన బకాయిలను చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని వారు హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు త్వరలో విచారణ చేపట్టనుంది.
READ MORE: Off The Record: “రెండు కళ్ల సిద్ధాంతం”.. పవన్ విషయంలో పార్టీ నేతలు, ఫ్యాన్స్ అంచనాలు తప్పుతున్నాయా?
Also Read
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ
- BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..
తాజావార్తలు
-
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
-
Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
-
Esther Anil : మోహన్ లాల్’ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
-
Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
-
Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!