High Court: వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ జడ్పీటీసీలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కడప జిల్లాకు చెందిన 27 మంది జడ్పీటీసీ సభ్యులు తమకు చెల్లించాల్సిన గౌరవ వేతనం, టీఏ, డీఏ బకాయిలను వెంటనే చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ముత్యాల చెన్నయ్య సహా 27 మంది జడ్పీటీసీలు కలిసి దాఖలు చేశారు. పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. గత 35 నెలలుగా ఒక్కో సభ్యుడికి సుమారు రూ.2…