మరో రెండ్రోజుల్లో ఐపీఎల్ సంగ్రామం ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ తమ హోంగ్రౌండ్‌లలో ప్రాక్టీస్‌లలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో.. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మెంటర్, భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. ఎం.ఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య హైఓల్టోజ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లు లక్నోలో ఆడినప్పుడు.. వారి అభిమానులు స్టేడియంలో అధికంగా ఉంటారని.. ఈ ట్రెండ్ మార్చడానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు జహీర్ ఖాన్ సరదాగా స్పందించారు. “ఎంఎస్ ధోని ఉన్నంత కాలం, ఏ స్టేడియమైనా పసుపుమయంగా మారుతుంది. ధోనికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతను ఐపీఎల్ ఆడుతున్నంత కాలం.. ఇది కొనసాగుతూనే ఉంటుంది,” అని చెప్పారు. చెన్నై సూపర్ కింగ్స్ లక్నోలో ఆడినప్పుడల్లా స్టేడియం మొత్తం ఎల్లో జెర్సీలే దర్శనమిస్తాయని తెలిపారు. ఏప్రిల్ 14, 2024న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కూడా స్టేడియం పసుపుమయంగా మారింది. ఆ మ్యాచ్‌లో ధోని కేవలం తొమ్మిది బంతుల్లో 28 పరుగులు చేశాడు. 3 బౌండరీలు, 2 సిక్సర్లతో అభిమానులను ఉత్సాహపరిచాడు.
Read Also: KTR: రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా.. జహీర్ ఖాన్‌కు మరో ఆసక్తికర సంఘటన ఎదురైంది. 2005లో బెంగళూరులో జరిగిన భారత్-పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా.. ఒక మహిళా అభిమాని స్టేడియంలో ‘జహీర్, ఐ లవ్ యూ’ అని రాసిన ప్లకార్డుతో ప్రపోజ్ చేసింది. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత.. అదే అభిమాని లక్నో సూపర్ జెయింట్స్ ప్రీ-సీజన్ శిబిరంలో జహీర్‌ను కలుసుకుని, మరోసారి ‘జహీర్, ఐ లవ్ యూ’ అని రాసిన ప్లకార్డుతో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 2025 కోసం రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా నియమించుకుంది. అయితే, గాయాల కారణంగా మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్‌లు ప్రారంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నారు. శివమ్ మావి, శార్దూల్ ఠాకూర్ జట్టుతో శిక్షణ పొందుతున్నారని, ప్రత్యామ్నాయంగా వారిని తీసుకునే అవకాశం ఉందని సమాచారం. లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్ మార్చి 24, సోమవారం విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.