NTV Telugu Site icon

YV Subba Reddy: జమిలీ ఎన్నికలపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Yv Subbareddy Srinivasa Set

Yv Subbareddy Srinivasa Set

YV Subba Reddy: మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం జమిలీ కేంద్రం జమిలీ ఎన్నికల దిశగా అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్దంగా ఉన్నామన్న ఆయన సీఎం జగన్ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు తిరిగి జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలనుకుంటున్నారన్నారు. ఏపీలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడ లేవని సుబ్బారెడ్డి కితాబిచ్చారు. ఇక పోటీ విషయం గురించి మాట్లాడుతూ ప్రతి నిర్ణయం జగనే తీసుకుంటారన్నారు. .ఎన్నికల్లో పోటీ విషయంలో సీఎం జగన్ ఎలా నిర్ణయిస్తే అలా చేస్తామని తెలిపారు.

ఇక తన పోటీ విషయం గురించి మాట్లాడుతూ ఎక్కడ పోటీచేయాలని ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పిన ఆయన పార్టీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని వెల్లడించారు. ఇక మాజీమంత్రి బాలినేనిపై కుట్రల గురించి ప్రశ్నించగా బాలినేనిపై ఎవరు కుట్రలు చేశారో తనకు తెలియదని అలా చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఆ ఆలోచన కూడా తనకు లేదని తేల్చి చెప్పారు. తాను కేవలం పార్టీ అప్పగించిన భాద్యతలు నిర్వర్తించుకుంటూ వెళుతున్నట్టు చెప్పుకొచ్చారు. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు రావడంపై ఆయన స్పందించారు. ఏమి చేయకుండా ఊరికే ఐటీ నోటీసులు రావు కాదా అని ప్రశ్నించారు. అక్రమంగా నిధులు వచ్చాయని నిర్ధారణ అయ్యాకే ఐటీ సమన్లు ఇస్తారని పేర్కొన్నారు. తాను నిజాయితీ పరుడ్ని అని గంటలు గంటలు చెప్పుకునే చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిన అవినీతికి నిదర్శనాలే ఐటీ నోటీసులని పేర్కొ్న్నారు.

Also Read: Visakhapatnam: విశాఖ సిగలో మరో పర్యాటక మణిహారం
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్రల గురించి మాట్లాడుతూ దాని వల్ల ప్రజల్లో మార్పేమీ ఉండదన్నారు. ఎవరు ఎన్ని యాత్రలు చేసినా.. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు జగన్ ను సీఎం చేయాలని డిసైడయ్యారన్నారు.ప్రత్యేక హోదా, రాష్ట్రానికి సంబంధించిన పథకాల అమలులో ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని తెలిపిన సుబ్బారెడ్డి, సీఎం జగన్ ప్రధానిని కలిసిన ప్రతీసారీ ప్రత్యేక హోదాపై విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో కేంద్రానికి స్పష్టమైన మెజారిటీ రాకుంటే ఏపీలో గెలిచే ఎంపీ స్థానాలపై ఆధారపడితే కచ్చితంగా హోదా సాధించుకోవచ్చని పేర్కొన్నారు. ఇక దొంగ నోట్ల పై చంద్రబాబు చేస్తున్న కామెంట్లపై ఆయన స్పందిస్తూ దొంగ ఓట్ల విషయంలో చంద్రబాబు వైఖరి దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.చంద్రబాబు గతంలో ఎన్ని దొంగ ఓట్లు చేర్పించారో త్వరలో బయటకు వస్తుందన్నారు.దొంగ ఓట్లు లేకపోతే తాము బలం లేక ఓడిపోతామనేది చంద్రబాబు భయమన్నారు. చంద్రబాబు ప్రతీసారీ ఎవరో ఒకరి బలం తోనే సీఎం అయ్యారు తప్ప సొంత బలంతో కాదన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఏమైనా మాట్లాడుతారని, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ఎలా అన్యాయం చేసిందో అందరికి తెలుసునన్నారు. ఇక లోకేష్ పాద యాత్ర పేరుతో ప్రజలను ఎలా రెచ్చగొడుతున్నారో అందరూ గమనిస్తున్నారని, లోకేష్ పాదయాత్రకు ఎలాంటి స్పందన వస్తుందో చూస్తుంటేనే అర్థం అవుతుందన్నారు. సీఎంని నోటికొచ్చినట్లు దుర్బాషలాడటం ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నారని సుబ్బారెడ్డి మండిపడ్డారు.