Yuvraj Singh: ధోనీ, కోహ్లీ, రోహిత్.. యువరాజ్ ఫేవరెట్ కెప్టెన్ ఎవరో తెలుసా?
- ప్రపంచకప్‌నలలో యువరాజ్ పాత్ర మరువలేనిది
- 2014లో మాత్రం విమర్శలు
- యువీ ఫేవరెట్ కెప్టెన్ ఎవరంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yuvraj Singh Reveals His Favourite India Captain: 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకోవడంలో మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పాత్ర మరువలేనిది. తన బ్యాటింగ్, బౌలింగ్‌తో ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఇన్నింగ్స్ చివరలో 21 బంతుల్లో 11 రన్స్ మాత్రమే చేసి విమర్శలపాలయ్యాడు. ఆపై జట్టులో చోటు దక్కకపోవంతో యూవీ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న యువరాజ్.. తన ఫేవరెట్ కెప్టెన్ ఎవరో చెప్పాడు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో కలిసి యువరాజ్ సింగ్ ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొనగా.. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలలో ఎవరిని అత్యుత్తమ కెప్టెన్‌గా ఎంచుకుంటారు అనే ప్రశ్న ఎదురైంది. టీ20 ఫార్మాట్‌కు రోహిత్‌ను కెప్టెన్‌గా ఎంచుకుంటానని ఆసక్తికర సమాధానమిచ్చాడు. ‘టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మను ఎంచుకుంటా. రోహిత్ అత్యుత్తమ కెప్టెన్. అతడు తన బ్యాటింగ్‌తో క్షణాల్లో మ్యాచ్‌ను మార్చగలడు. నా ఫస్ట్ ఛాయిస్ కెప్టెన్ రోహితే’ అని యువీ చెప్పాడు.
Also Read
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
Also Read: Shakib Al Hasan: షకిబ్ సెక్యూరిటీతో మాకు సంబంధం లేదు: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు
ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలలో ఎవరిని బెంచ్‌కు పరిమితం చేస్తావని ఇద్దరు దిగ్గజాలు యువరాజ్ సింగ్‌ను మరో ప్రశ్న అడిగారు. ‘ఇద్దరిలో ఒకరిని ఎంచుకుంటే అది ప్రపంచవ్యాప్తంగా మీడియాలో హెడ్‌లైన్స్ అవుతుంది. కాబట్టి నేనే బెంచ్‌కు పరిమితవుతా’ అని యువీ పేర్కొన్నాడు. నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభంకానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ 3-2తో గెలుస్తుందని యువరాజ్ ధీమా వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!