Shakib Al Hasan: షకిబ్ సెక్యూరిటీతో మాకు సంబంధం లేదు: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు
- టీ20లకు షకిబ్ వీడ్కోలు
- భద్రతపై ఆందోళన
- బంగ్లాదేశ్‌లో చివరి టెస్టు ఆడాలనుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shakib Al Hasan Retirement: బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బంగ్లాదేశ్‌లో తన భద్రతపై షకిబ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘బంగ్లాదేశ్‌కు వెళ్లడం పెద్ద సమస్య కాదు. వెళ్లాక బంగ్లాను వీడడమే కష్టం. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు నా భద్రతపై ఆందోళనగా ఉన్నారు’ అని షకిబ్ అన్నాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
బంగ్లాదేశ్‌లో చివరి టెస్టు ఆడాలనుందని షకిబ్ అల్ హసన్ తన మనసులోని మాటను వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) చీఫ్ ఫరూఖి అహ్మద్ స్పందించారు. షకిబ్ సెక్యూరిటీతో తమకు ఏ సంబంధం లేదన్నారు. ‘షకిబ్ సెక్యూరిటీ మా చేతుల్లో లేదు. బంగ్లా బోర్డు ఎవరికీ వ్యక్తిగతంగా భద్రతను ఇవ్వదు. షకిబ్ తన నిర్ణయం చెప్పాడు. అతడి సెక్యూరిటీకి సంబంధించి ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు స్పందిస్తాయి. పోలీస్, రాబ్ మాదిరిగా బీసీబీ సెక్యూరిటీ ఏజెన్సీ కాదు. షకిబ్ విషయంలో ప్రభుత్వానిదే కీలక పాత్ర. ఈ విషయంలో బీసీబీ ఎలాంటి ప్రకటన చేయదు’ అని ఫరూఖి తెలిపారు.
Also Read
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
Also Read: iPhone 15 Discount: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15పై 19వేల డిస్కౌంట్!
‘బంగ్లా విజయాల్లో షకిబ్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు అతడి పరిస్థితి క్లిష్టంగా ఉంది. షకిబ్ వ్యక్తిగత విషయాలపై మేం స్పందించలేం. సొంత మైదానంలో చివరి టెస్టు ఆడాలనుకుంటున్నాడు. మాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ భద్రతకు సంబంధించి మేం ఎలాంటి భరోసా ఇవ్వలేం. చివరి టెస్టు ఆడేందుకు ఇదే సరైన సమయమని భావించి.. షకిబ్ ఆ ప్రకటన చేశాడు. అతడి నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం’ అని బీసీబీ చీఫ్ ఫరూఖి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!