NTV Telugu Site icon

Shyamala: టీడీపీ నేతలు జనంలోకి రావాలి

Shyamala

Shyamala

Shyamala: వైస్సార్సీపీ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె కూటమి ప్రభుత్వంపై విరుచుక పడ్డారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి అలాగే మోసం చేశారని.. చేతగానప్పుడు, చేయలేనప్పుడు వాగ్ధానాలు చేయకూడదని ఆవిడ పేర్కొంది. సూపర్ సిక్స్ పేరుతో బాండు పేపర్లు ఇచ్చి నిలువునా మోసం చేశారని, మహిళలను మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టవచ్చని ఆమె మాట్లాడారు. 2014లో కూడా డ్వాక్రా రుణమాఫీ పేరుతో మోసం చేశారని, నమ్ముతున్నారని మహిళలను సులువుగా మోసం చేస్తున్నారంటూ ఆవిడ పేర్కొన్నారు.

Also Read: RK Roja: నగరి ఘటనపై స్పందించిన రోజా

అలాగే తల్లికి వందనం పేరుతో జగన్ ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని ఆపేశారని, లక్షలాది మంది తల్లులు, విద్యార్ధులు అమ్మఒడి కోసం ఎదురు చూస్తున్నట్లు ఆవిడ తెలిపారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ 15 వేలు చొప్పున ఇస్తామన్నారని, రాసి పెట్టుకోమని కూడా చెప్పినట్లు గుర్తు చేసారు. కానీ, ఇప్పుడు సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారని, హామీలు మాత్రం జనంలో ఇచ్చారు అంటూ శ్యామల పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వలేకపోతున్నామని నాలుగు గోడల మధ్య చెప్తున్నారని, తల్లికి వందనం ఇవ్వట్లేదని టీడీపీ నేతలు జనంలోకి వచ్చి చెప్పాలంటూ పేర్కొన్నారు. ఇంకా దీపం పథకం కింద ఇవ్వాల్సిన 4,115 కోట్లు ఎగ్గొట్టారని, కనీసం ఉచిత బస్సు పథకాన్ని కూడా అమలు చేయటం లేదంటూ ఎద్దేవా చేసారు.

Also Read: YS Jagan: కూటమి ప్రభుత్వానికి జగన్ సూటి ప్రశ్నలు

2025 జనవరి ఫస్ట్ కి జాబ్ కేలండర్ ఇస్తామని లోకేష్ ప్రకటించారని, ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో కాదుకదా.. కనీసం జాబ్ కేలండర్ కూడా ఎప్పుడు ప్రకటిస్తారో తెలియటం లేదని ఆవిడ అన్నారు. పండుగ హామీలు లేవు, పెళ్లిళ్ల కానుకలూ లేవని అన్నారు. సంపద సృష్టి అంటే ప్రజలకేమో అనుకున్నాం.. కానీ, చంద్రబాబు సొంతంగా సృష్టించుకోవటం అని ఇప్పుడే తెలిసిందని శ్యామల పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు 74 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని లెక్క తెలిసినా చంద్రబాబు హామీ ఇచ్చారని, హామీల అమలుపై వైస్సార్సీపీ పార్టీ పోరాటం చేస్తుందని ఆవిడ ప్రెస్ మీట్ లో తెలిపారు.

Show comments