Shyamala: వైస్సార్సీపీ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె కూటమి ప్రభుత్వంపై విరుచుక పడ్డారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి అలాగే మోసం చేశారని.. చేతగానప్పుడు, చేయలేనప్పుడు వాగ్ధానాలు చేయకూడదని ఆవిడ పేర్కొంది. సూపర్ సిక్స్ పేరుతో బాండు పేపర్లు ఇచ్చి నిలువునా మోసం చేశారని, మహిళలను మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టవచ్చని ఆమె మాట్లాడారు.…
ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీపం పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు సరిగా అమలు చేయలేదు.. కుటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేసి చూపుతోందని అన్నారు.