Perni Nani: ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆవేదనతో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. జగన్ జెండా మోసిన కార్యకర్తల ఇంట్లో జువ్వలు, టపాసులు కాల్చి ఇంట్లో వేసి మానసిక ఆనందం పొందారు. అలాగే కార్యకర్తల ఇంట్లో పూల కుండీలను బద్దలు కొట్టడం, కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగడం చేసారని ఆరోపించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఆలస్యం కావడానికి మధ్యలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులే ప్రధాన కారణమని నాని పేర్కొన్నారు. పార్టీ కోసం పని చేసిన వాళ్లపై అక్రమ కేసులు పెడుతున్నారని.. కాకాణి గోవర్ధన్, కొడాలి నాని, తాను ఇలా చాలా మంది నేతలపై తప్పుడు ఆరోపణలు మోపుతున్నారని అన్నారు.
Read Also: Flying Buses: ఢిల్లీ, బెంగళూరులో ట్రాఫిక్ సమస్య.. ఎగిరే బస్సులకు కేంద్రం ప్లాన్..
తనపై, తన భార్యపై కూడా రేషన్ బియ్యం కేసు పెట్టారని వివరించారు. మేము బాడుగకు ఇవ్వడానికి గోడౌన్లు నిర్మించాం. ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి పనిచేసిన వ్యక్తి తప్పు చేశాడు. బస్తాల తరలింపులో తేడా ఉందని చెప్పిన వెంటనే, తేడా వచ్చిన మొత్తం చెల్లిస్తామని జాయింట్ కలెక్టర్‌కి లేఖ ఇచ్చాం. అయినప్పటికీ, క్రిమినల్ కేసు పెట్టారని వివరించారు. 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందంటూ కేసులు పెట్టినట్టు చెప్పారు. కోర్టు కూడా ఈ కేసులో ఫైన్ కట్టి విడిపించిపెట్టాలని చెప్పిందని నాని తెలిపారు. సివిల్ సప్లై చరిత్రలో ఇలా ఎవరి మీదా కేసులు లేవు, నాపై తప్ప అని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Gold Silver Rates: బాబోయ్.. మరోసారి లక్ష చేరువకు పుత్తడి ధర.. ఇక కొన్నట్లేగా..?!
తన భార్యను కూడా అన్యాయంగా వేదించారని, బెయిల్ వచ్చేవరకు మాట్లాడవద్దని లీగల్ టీం సూచించడంతో తానే మాట్లాడలేకపోయానన్నారు. సీఐ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మీ టైమ్ నడుస్తుంది, నడవనివ్వండని నాని అన్నారు. కానీ, మాకు ఒకరోజు టైం వస్తుందని పేర్కొన్నారు. 2019లో జగన్ మోహన్ రెడ్డి సభలో మచిలీపట్నంలో పోర్టు, ఇళ్ల పట్టాల గురించి చెప్పారు. 15,400 మందికి పట్టాలు ఇచ్చాం. 40ఏళ్లగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఉంటున్న వాళ్లకు 819 మందికి ఇచ్చాం.. మొత్తం 19,410 మందికి పట్టాలు ఆన్‌లైన్ ద్వారా మంజూరు అయ్యాయి. వాటిని ఆన్‌లైన్‌లో సచివాలయం నుంచి మున్సిపల్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, చివరికి సీసీఎల్ వరకు అప్రూవ్ చేశారని వివరించారు.
ఇప్పుడు ఆ పట్టాలపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. 500 ఎకరాలు అమ్మిన రైతుల వద్దకు వెళ్లి ‘పేర్ని నానికి కమిషన్ ఇచ్చారా..?’ అని పోలీసులు అడుగుతున్నారు. నిజంగా పట్టాలు నకిలీ అయితే, సంతకాలు సునీల్‌ది కాదని చెప్పే ధైర్యం ఉందా? పోరెన్సిక్ ల్యాబ్ కి సిద్ధమా? అని సవాలు విసిరారు. పట్టాలు పంపిణీ సమయంలో అధికారుల సమక్షంలోనే నిర్ణయాలు తీసుకున్నామని, ఎలాంటి అక్రమం జరగలేదని స్పష్టం చేశారు. పక్కన కమిషనర్, MRO ఉన్నప్పుడు, ఎలా అనుమతి లేకుండా పట్టాలు ఇచ్చానంటారని ప్రశ్నించారు.