Anagani Satyaprasad : మాజీ సీఎం వైఎస్ జగన్‌ఫై మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శలు గుప్పించారు. ఇవాళ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. తన పాలనలో రాష్ర్ట విద్యుత్ రంగంపై దాదాపు లక్షా 30 వేల కోట్ల రూపాయల భారాన్ని మోపిన జగన్ ఇప్పుడు చిలకపలుకులు పలుకుతున్నాడని ఆయన మండిపడ్డారు. యూనిట్ కు ఐదు రూపాయలకు దొరికే విద్యుత్ కు బదులు 8 నుండి 14 రూపాయల వరకు కొనుగోలు చేసి ప్రజలపైన జగన్ రెడ్డి…
YSRCP : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపుతో సామాన్యులపై భారాన్ని పెంచిన ప్రభుత్వ నిర్ణయం దారుణమని ఆ పార్టీ నేతలు విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపు కారణంగా ప్రజలపై రూ. 15,000 కోట్ల అదనపు భారం పడిందని వైసీపీ ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాష్ట్ర…
కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన తలపెట్టిన ర్యాలీలు, వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. తాడేపల్లి వైయస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.